దసరా పండుగకు హిందూ మెజార్టీ ఏరియాలను టార్గెట్ చేయాలనుకుంటున్న పాకిస్తాన్!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మతపరమైన చిచ్చు పెట్టి విచ్ఛిన్నం చేసేందుకు pakistan దసరా పండుగను వాడుకోనుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. జమ్మూ అండ్ కశ్మీర్ లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ప్రకారం.. అల్-బదర్, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు pakistan లోని ముజఫ్ఫరాబాద్ లో ప్రత్యేకమైన ట్రైనింగ్ పొంది జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని హిందూ డామినేటెడ్ ఏరియాలను టార్గెట్ చేయనుంది.
టెర్రరిస్టులు అంతా సీనియర్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)ఆఫీసర్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారని ఇంగ్లీష్ మీడియా చెప్తుంది.

ఇప్పటికే pakistan రెండు సార్లు జమ్మూ అండ్ కశ్మీర్ నుంచి ఆయుధాలు స్మగ్లింగ్ చేసుకునేందుకు ప్రయత్నించింది. నార్త్ కశ్మీర్ లోని తంగ్దార్ సెక్టార్ వద్ద ఆర్మీ బలగాలు pakistan స్మగ్లింగ్ చేసుకున్న ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.

అందులో ఐదు పిస్టల్స్ తో పాటు, పది మ్యాగజైన్లు, 138 రౌండ్లు అమ్యూనిషన్ రికవరీ చేసుకున్నారు. ఇదంతా లైన్ ఆఫ్ కంట్రోల్ కు సమీపంలోనే జరిగింది. అక్టోబర్ 11న ఇండియా బలగాలు నార్త్ కశ్మీర్ పొరుగు ప్రాంతమైన కీరన్ సెక్టార్ నుంచి నాలుగు ఏకే 74రైఫిల్స్ స్వాధీనం చేసుకుంది.
గంగానది ఒడ్డున టెర్రరిస్టుల కదలిక ఉందని గమనించిన ఇండియన్ ఆర్మీ జమ్మూ అండ్ కశ్మీర్ తో కలిసి జాయింట్ ఆపరేషన్ లో పాల్గొంది. అక్కడ ముగ్గురు వ్యక్తులు కొన్ని వస్తువులు ట్రాన్స్ పోర్ట్ చేస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి ఏకే 74రైఫిల్స్, 8 మ్యాగజైన్లు, 240 ఏకే రైఫిల్ అమ్యూనిషన్ ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.


Related Tags :

Related Posts :