బతికుండగానే నటిని చంపేసిన సోషల్ మీడియా

Pakistani actress Ayeza Khan rubbishes rumours saying she died in plane crash

పాకిస్తాన్‌లో శుక్రవారం(మే 22,2020) ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 99మంది చనిపోయారు. కాగా, జనావాసాల మధ్య విమానం కూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ విమాన ప్రమాదంలో పాక్ నటి అయేజా ఖాన్‌ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేశాయి. అంతేకాదు, ఆమె భర్త డానిష్ కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసినట్లు వార్తలొచ్చాయి. 

అసత్య వార్తలను ప్రచారం చేసేవారిని ఆ దేవుడు తప్పక శిక్షిస్తాడు:
అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. నటి అయేజా ఖాన్ బతికే ఉన్నారు. నిక్షేపంగా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా అయేజా ప్రకటించారు. విమాన ప్రమాదంలో తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరగడం చూసి ఆమె షాక్ తిన్నారు. తన మరణ వార్తపై స్పందించిన అయేజా ఖాన్, తాను చనిపోయినట్టు వస్తున్న వార్తలను ఖండించారు. నేను, నా భర్త బతికే ఉన్నామని చెప్పారు. దయచేసి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా, నిర్ధారణ చేసుకోకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేసేవారిని ఆ దేవుడు తప్పక శిక్షిస్తాడని అన్నారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఆమె పోస్ట్‌ పెట్టారు.

అసలు ఆ విమానంలో తాను ప్రయాణమే చేయలేదని ఖాన్ స్పష్టం చేశారు. సో, విమాన ప్రమాదంలో నటి మృతి అనే న్యూస్ ఫేక్ అని తేలిపోయింది. దీంతో హీరోయిన్ అభిమానులు రిలాక్స్ అయ్యారు. అయేజా ఖాన్ పాకిస్తాన్ ప్రముఖ టీవీ నటి. అదూరి ఔరత్, కోయి చాంద్ రక్, తుమ్ కౌన్ పియా లాంటి ప్రముఖ టీవీ షోస్ లో లీడ్ రోల్ పోషించారు.

బతికుండగానే పలువురిని చంపేసిన సోషల్ మీడియాలో:
కాగా, గతంలోనూ సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు అనేకం వచ్చాయి. పలువురు సినీ సెలబ్రిటీలకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మన టాలీవుడ్ లోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. బతికుండానే కొందరు నటులను సోషల్ మీడియా చంపేసింది. కొందరు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉండగా, వారు చనిపోయారని శ్రద్దాంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. ఈ వార్త నిజమేనేమో అని అభిమానులు, బంధువులు, మిత్రులు కంగారుపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత నిజం తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. సో, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలనే పరిస్థితి ఏర్పడింది. గుడ్డిగా నమ్మితే మోసపోవడం ఖాయం అంటున్నారు నెటిజన్లు.

Read: త్వరలో అవతార్-2 షూటింగ్ ప్రారంభం, గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత

మరిన్ని తాజా వార్తలు