pakistani anchors promoting a juice brand during prime time

లైవ్‌లో వార్తలు చదువుతూ జ్యూస్ తాగిన యాంకర్లు..గీకితే మీరే విన్నర్ అంటూ ఆఫర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

న్యూస్ చానెల్ లో వార్తలు చదువుతు..న్యూస్ ప్రెజెంటర్లు మధ్య బ్రేక్ చెబుతుంటారు.అలా బ్రేక్ చెప్పిన వారు ఆ సమయంలో ఏం చేస్తారు? అనే అనుమానం చాలామందికి వచ్చే ఉంటుంది. వాళ్లుఏంచేస్తారు? అనేమాట పక్కన పెడితే..పాకిస్థాన్ లో ఓ న్యూస్ చానల్ వార్తల మధ్యలో యాకర్లతో చేయించిన ఐడియా సోషల్ మీడియాలో వైరల్ గామారింది. రొటీన్‌ కు భిన్నంగా ఉండాలనుకున్నారేమో..

న్యూస్ మధ్యలో ప్రకటనలు రాగానే వెంటనే చానెల్ మార్చేస్తారనేవిషయంపై ఓ పాకిస్తానీ టీవీ చానెల్‌ ఓ ఐడియా వచ్చింది.  వార్తలు చదువుతున్నప్పుడే న్యూస్ యాంకర్లతో ఓ ప్రొడక్టుకు ప్రకటన చేయించింది. అలా చేయించటంతో డబ్బులకు డబ్బులు వస్తాయి..టీవీలో ట్రెండ్లీగా వస్తున్న ఈ ఐడియాకు చక్కటి రెస్పాన్స్ వస్తుందని ఐడియావేసింది ‘అబ్ తక్’ అనే న్యూస్ చానెల్‌.

వార్తల మధ్యలో ప్రకటనలు (అడ్వర్ టైజ్ మెంట్స్) వచ్చిన తర్వాత వార్తలు చదివే యాంకర్లు (న్యూస్ ప్రెజెంటర్స్ ) మామూలుగా పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కనిపించారు. అలా మాట్లాడుకుంటూన్న వారి చేతిలో ఓ జ్యూస్ టెట్రా ప్యాకెట్ కూడా ఉంది. 

అలా వారు జ్యూస్ తాగుతూ..స్పెషల్ ఆఫర్‌ని ప్రకటించారు. రూ.20ల ఆ జ్యూస్ ప్యాకెట్ కొని స్క్రాచ్ చేస్తే..లక్కీ విన్నర్లకు 300 జీబీ ఇంటర్నెట్ ఫ్రీ అని చెప్పారు. ఈ క్లిప్పింగ్‌ను నైలా ఇనాయత్ అనే జర్నలిస్టు ట్వీట్ చేస్తూ..‘‘టు ఇన్ వన్. ‘అబ్‌తక్’ న్యూస్ యాంకర్లు బులెటిన్‌లో జ్యూస్ లు అమ్ముకుంటున్నారు’’ అని సెటైర్ వేసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ప్రకటనపై నెటిజనులు ఊరుకుంటారా ఏంటీ..వాళ్లు కూడా వాళ్ల వాళ్ల స్టైల్లో  ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

దేవీ ప్రసాద్ రావు అనే ట్విట్టర్ యూజర్ ‘‘వారు బాత్‌టబ్‌లో కుర్చొని లక్స్ సబ్బుకు ఎప్పుడు ప్రకటన చేస్తారా? అని ఎదురు చూస్తున్నాం’’ అని ట్వీట్ చేయగా మారో యూజర్ ..‘‘పాకిస్తానీలు తలచుకుంటే వాళ్ల పీఎంను కూడా అమ్మేస్తారంటూ మరో సెటైర్ వేసారు. దీనికి అతడిని అమ్మినా ఏం లాభం ఉండదు’’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇలా ఈ వీడియోపై కామెంట్స్ వర్షం కురుస్తోంది.

Related Posts