లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Trending

పెళ్లిలో వరుడి చేతిలో AK-47 గన్.. కట్ చేస్తే..!

Published

on

Pakistani groom gets AK-47 rifle as wedding gift : పెళ్లికి వెళ్తే గిప్ట్‌లు తీసుకెళ్లడం కామన్.. పెళ్లిలో వధువరులకు తమకు తోచిన గిఫ్ట్‌లను ఇస్తుంటారు. అంతటితో ఆగరు.. గిఫ్ట్‌లు ఇచ్చి ఫొటోలకు ఫోజిలిస్తుంటారు. ఎక్కడైనా పెళ్లిలో డబ్బులు, అభరణాలు బహుమతిగా ఇవ్వడం చూశాం.. లేదంటే.. ఇంట్లో అవసరమైన వస్తువులను బహుమతిగా ఇవ్వడం తెలుసు.కానీ, ఓ పెళ్లిలో మాత్రం వరుడికి ఏకంగా AK-47 గన్ గిఫ్ట్ గా ఇచ్చారు. అది చూసిన వరుడు మెల్లగా పైకి లేచి చేతిలో పట్టుకుని మరి ఫొటోకు ఫొజిచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పెళ్లి రిసెప్షన్‌లో వధువు పక్కన కూర్చొని ఉన్న వరుడికి ఓ మహిళ ఏకే-47 గన్ ప్రజెంట్ చేసింది.. అదేంటీ.. మారణాయుధం బహుమతిగా ఇవ్వడమేంటి? అని విస్తుపోవాలి కదా.. కానీ, పెళ్లిలో అతిథులంతా ఆహా.. ఓహో అంటూ చప్పట్లు కొట్టారు. ఇంతకీ ఈ వింతైన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?.. పాకిస్తాన్‌లో అంట..

వీడియో చూస్తే.. అందులో ఓ మహిళ వధువరులను ఆశీర్వదించిన తర్వాత ఏకే 47 గన్ బహుమతిగా ఇచ్చింది. పాకిస్తాన్‌లో ‘కలాష్నికోవ్’ అనే సాంప్రదాయం ప్రకారం.. అత్తగారు.. కొత్త అల్లుడికి ఇచ్చే కట్నమంట..ఏం మర్యాదో ఏమో… ఇలా మారణాయుధాలను బహుమతిగా ఇస్తారా అంటూ నెటిజన్లు విస్తుపోతున్నారు. వరుడికి బదులుగా వధువుకు ఇస్తే బాగుండు.. మెట్టినింట్లో అత్తగారి వేధింపులు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటారు.. అని కామెంట్లు పెడుతున్నారు. గిఫ్ట్ సరే.. పొరపాటున పేలితే పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *