లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

పాకిస్తాన్ పెళ్లి కొడుక్కి గిఫ్ట్‌గా AK-47

Published

on

పెళ్లికి పిలిస్తే వెడ్డింగ్ గిఫ్ట్ ఏం తీసుకెళ్లాలా అని ఆలోచించడానికి తల పట్టుకుంటాం. కాసేపు ఆలోచిస్తనే కానీ, అర్థం కాదు ఏం తీసుకెళ్లాలో.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురి స్వభావాన్ని బట్టి గిఫ్ట్ తీసుకెళతాం. కిచెన్ ఐటెంలు లాంటివి తీసుకెళడంతో పాటు అడ్వంచెరియస్ గిఫ్ట్ లు ఇస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది.

చాలా నార్మల్ గా ఫీల్ అయి AK-47 గన్ ను పెళ్లి కొడుక్కి గిఫ్ట్ గా పట్టుకొచ్చింది ఓ మహిళ. మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నిజం. ఈ 30సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్విట్టర్, ఫేస్‌బుక్ లలో మహిళ చేతి నుంచి అందుకుంటున్న AK-47 గిఫ్ట్ ను చూసి తెగ నవ్వేసుకుంటున్నాడు పెళ్లి కొడుకు.పెళ్లి కొడుకు అత్తే ఈ రైఫిల్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. పెళ్లికి అత్తలు ఇలాంటి గిఫ్ట్ లు కూడా ఇస్తారా అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. రెండున్నర లక్షల మంది చూసిన వీడియోకు 2వేల 800లైకులు వచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ లో అంతా అరిచి గోల చేస్తున్నప్పటికీ పెళ్లికొడుకు-పెళ్లి కూతురు ఆ గిఫ్ట్ ను చాలా రొటీన్ గానే తీసుకున్నారు.

కొన్ని సంప్రదాయాల ప్రకారం.. వారి తండ్రులు లేదా తాతలు వేటాడినప్పటి రైఫిల్ ను కొడుకు లేదా మనవడికి గిఫ్ట్ గా ఇస్తుంటారు. ‘టెర్రరిజం అని అరిచే ముందు కాసేపు ఆగండి. ఇది కొన్ని ఫ్యామిలీల్లో జరిగే సంప్రదాయం మాత్రమే. గౌరవం కోసమే ఇలా ఇస్తుంటారు’ అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *