వారికి మాత్రమే : పాకిస్థాన్ లో ‘ఇస్లామిక్’ పరుపులు’తయారీ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పనిచేసి అలసిపోయి నిద్రించే పరుపుల్లో ఎన్నో రకాలున్నాయి. కొన్ని కంపెనీలు తాము తయారు చేసిన పరుపులపై పడుకుంటే సుఖనిద్ర ఖాయమని చెప్పే ప్రకటలు చూస్తుంటాం. అంతేకాని ప్రత్యేకించి ఈ పరుపులు ‘హిందు’ మతస్తులకు’ ఈ పరుపులు ‘ఇస్లాం’ మతస్తులకు మాత్రమే అని అమ్మటం ఎప్పుడైనా చూసారా? పోని కనీసం విన్నారా? బహుశా విని ఉండరు.కనీసం అటువంటి ఆలోచనే విని ఉండరు.కానీ పాకిస్థాన్ మాత్రం దీనికి పూర్తి భిన్నం. ఇస్లాం దేశమైన పాకిస్థాన్ లో ‘ఇస్లామిక్ పరుపులు’ తయారు చేశారు. అంతేకాదు..ఇవి పూర్తిగా ‘ఇస్లాం’లకు మాత్రమే అని ఈ పరుపులు వెనక పెద్ద ఆరోగ్య, శాస్త్రీయ సూత్రాలు కూడా ఉన్నాయని ప్రచారం చేస్తోంది ఆ ‘ఇస్లాం’పరుపులు తయారు చేసే కంపెనీ.పాకిస్తాన్‌లో తొలిసారిగా ఇస్లామిక్ పరుపులు తయారయ్యాయి. డైమండ్ ఫోమ్ అనే కంపెనీ ఇస్లామిక్ పరుపులను తయారు చేసింది. ఈ పరుపులు వెనక పెద్ద ఆరోగ్య, శాస్త్రీయ సూత్రాలు ఉన్నాయని ప్రచారం కూడా చేస్తోంది.

డైమండ్ కంపెనీ చెప్పే సూత్రాలిలా ఉన్నాయ్ : ‘ఇస్లామిక్ నిద్రా విధానంలో వెల్లకిల్లా, కుడివైపు తిరిగి నిద్రపోయేవారికి ఇవి పనికొస్తాయి. కుడివైపు తిరిగి నిద్రపోవడం వల్ల గుండె పైభాగంలో ఉంటుంది. అందువల్ల ప్రార్థన కోసం అనుకున్న సమయానికి వేకువఝామునే లేవొచ్చు.. 1400 ఏళ్లుగా ఇలా పడుకోవడం అలవాటు. కుడివైపు పడుకోవడం వల్ల పొట్టపై బరువు పడదు. పేగులు గుండెకు ఒత్తిడి పడదు. దీంతో రక్తప్రసరణకు ఇబ్బంది ఉండదు’ అని ప్రచారం చేస్తోంది డైమండ్ కంపెనీ.ఈ పరుపుకు ‘సహా’ అనే పేరు కూడా పెట్టారు. కాగా ఈ కంపెనీ తాము తయారుచేసి ప్రచారం చేస్తున్న పరుపుల గురించి సోషల్ మీడియాలో కొందరు దీనికి వేరే డిజైన్లు జతచేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని డైమండ్ ఫోమ్ గుస్సా అవుతోంది. ఆ సంగతి పక్కనబెడితే ఈ ‘ఇస్లాం’ పరుపుల రేటు గురించి తెలుసుకుందాం..సింగిల్ కాట్ పరుపు 17 వేలు, డబుల్ కాట్ పరుపు 21 వేలు, అదే కింగ్ సైజు పరుపు రూ. 25500కు అని చెబుతోంది సరదు డైమండ్ కంపెనీ.

కాగా..ఈ పరుపుల గురించి ఒకొక్కరూ ఒకలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సెంటిమెంట్లను బిజినెస్ కు అనుకూలంగా మలచుకోవడంలో కంపెనీలు దూసుకెళ్తున్నాయని అంటున్నారు.

Related Posts