లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

మద్యం బాటిల్ కు పాకిస్థాన్ జాతిపిత ‘జిన్నా’ పేరు

Published

on

pakisthan-alcoholic-drink-named-after-pak-founder-jinnah

Pakisthan  : Alcoholic drink named Pak founder Jinnah : భారతదేశ జాతిపిత్ ‘మహాత్మా గాంధీ’. మన దాయాది దేశం జాతిపిత ‘మహ్మద్ అలీ జిన్నా’. ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందమే..పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా పేరును ఓ మద్యం బాటిల్‌కు పెట్టారు. జిన్ బాటిల్‌కు జిన్నా పేరు పెట్టినట్టు ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఆ మద్యం బాటిల్ పేరును ఆ ఫోటోలో స్పష్టంగా చూపించాడు. ఆ బాటిల్ లేబుల్ మీద ‘మ్యాన్ ఆఫ్ ప్లెజర్’ జిన్నా స్మృతిలో అంటూ రాశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ ధ్రువీకరించలేదు.

జర్మనీలోని కాన్వెంట్ లో 76 మందికి కరోనా పాజిటివ్
పాకిస్తాన్ జాతిపితగా పేరుగాంచిన మహమ్మద్ అలీ జిన్నా బ్రిటిష్ వారు అఖండ భారతావనిని పాలించిన సమయంలో ఇండియాలో (ఇప్పటి పాకిస్థాన్ లోని కరాచీలో)  1876 డిసెంబర్ 25న జన్మించారు. పాకిస్తాన్‌కు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని జిన్నా పోరాటం చేశారు.దీంతో ఆగస్టు 14, 1947న భారత్ నుంచి విడిపోయి పాకిస్తాన్ ఏర్పడింది. అప్పుడే భారత్, పాకిస్తాన్ విడిపోయాయి. ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పడిన అనంతరం పాక్ కు మహ్మద్ అలీ జిన్నా ‘మహా నేత’గా మారారు. పాకిస్థాన్ జాతిపితగా పేరొందారు. జిన్నా పేరుతో కరెన్సీ నోట్లు కూడా ఉన్నాయి. ‘మంచి స్కాచ్, విస్కీ, జిన్, పూల్ బిలియర్డ్స్, సిగరెట్లు, పోర్క్ సాస్‌లు ఎంజాయ్ చేసిన జిన్నా దానిపై వచ్చిన వ్యాఖ్యలను ఎప్పుడూ ఖండించలేదు.’ అని ఆ లేబుల్ మీద రాసి ఉంది.


దీనిపై పాకిస్తాన్ ట్విటర్ యూజర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీన్ని జాతీయ పానీయంగా చేయాలని ఓ యూజర్ డిమాండ్ కూడా చేశాడు. ‘జాతి పిత జిన్నా పేరుతో జిన్ను తెచ్చాం’ అని మరో యూజర్ ట్వీట్ చేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *