లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

జమ్మూలో పాక్ రహాస్య సొరంగం.. ఈ మార్గంలోనే ఉగ్రవాదులు చొరబడుతున్నారంట!

Published

on

Pak’s secret tunnel to push terrorists for 8 years in Jammu  : జమ్మూలో పాక్ రహాస్య సొరంగ మార్గం బయటపడింది. భారతదేశంలోకి ఉగ్రవాదులను ఈ సొరంగ మార్గం ద్వారానే పాక్ పంపుతోందంట. జమ్మూకశ్మీర్ లోని భూగర్భంలో 150 మీటర్ల వెడల్పు కలిగిన రహాస్య సొరంగ మార్గాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గుర్తించింది. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఈ సొరంగ మార్గంలోనే ఉగ్రవాదులను ఇండియాలోకి పంపుతోందంట.. సరిహద్దు బలగాల భూగర్భ సొరంగాల కోసం తనిఖీలు చేపట్టిన 10 రోజుల్లో బయటపడ్డ రెండో సొరంగం ఇది.

గత ఏడాదిలో కూడా పాకిస్తాన్ వెబ్ టన్నల్స్ నిర్మించిందనే నిఘావర్గాల సమాచారంతో బీఎస్ఎఫ్ సోదాలు చేపట్టిందని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘ఈ సొరంగ మార్గం చాలా పెద్దది’ అని ఆయన చెప్పారు. చూస్తుంటే ఈ సొరంగ మార్గం 6 నుంచి 8 ఏళ్ల కాలం నాటిదిగా చెబుతున్నారు. ఉగ్రవాదులను దేశంలోకి చొరబడేందుకు వీలుగా ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు.

ఖతువా జిల్లాలోని పన్సార్ వద్ద బీఎస్ఎఫ్ ఔట్ బోర్డు పోస్టు సమీపంలో 14, 15 నెంబర్ల మధ్య 30 అడుగుల లోతైన సొరంగ మార్గం ఉందని గుర్తించారు. దీనికి మరో పక్కన నిర్మించిన కంచెకు పాకిస్తాన్ బోర్డర్ ఔట్ పోస్టు అభియాల్ డోగ్రా, కింగ్రే-డి-కోతే ఉంది. పాకిస్తానీ షాకార్ గఢ్ కంచె చుట్టూ జైషే ఈ మొహమ్మద్ ఆపరేషనల్ కమాండర్ కాసీం జాన్ ఆధ్వర్యంలో ఉగ్రవాద శిక్షణ కార్యక్రమాలకు నిలయమని భారతీయ నిఘా వర్గాలు విశ్వసిస్తున్నాయి.