లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఏపీలో పూర్తైన ‘స్థానిక’ ఎన్నికలు…చివరి విడతలోనూ వైసీపీదే హవా

Published

on

panchayat elections completed in AP : ఏపీ పంచాయతీ తుది విడత ఎన్నికల్లోనూ వైసీపీనే సత్తా చాటింది. వెల్లడైన ఫలితాల్లో వైసీపీ మద్దతుదారులే ఎక్కువ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లుగా గెలుపొందారు. ఇంకా పలు పంచాయతీల్లో దాదాపు కౌంటింగ్ పూర్తయ్యింది. వచ్చిన ఫలితాల్లో 80 శాతం పైగా పంచాయతీలను తమ పార్టీ మద్దతుదారులే గెల్చుకున్నారని వైసీపీ చెప్తోంది. అయితే.. 40 శాతం మంది విజేతలు తమ పార్టీ మద్దతుదారులేనని టీడీపీ నేతలు చెప్తున్నారు.

నాలుగో విడతలో మొత్తం 3వేల 299 చోట్ల నోటిఫికేషన్ ఇవ్వగా.. 554 గ్రామల్లో ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగిన 2వేల 743 చోట్ల అధికార వైసీపీ దాదాపు 2వేల గ్రామాల్లో విజయం సాధించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ దాదాపు 5వందల చోట్ల గెలిచిందని.. ఇతరులు 130కి పైగా స్థానాల్లో గెలిచినట్లు సమాచారం.

నాలుగు విడతల్లో వచ్చిన ఫలితాల్లో దాదాపు 10వేల పంచాయతీలను సొంతం చేసుకున్నట్లు అధికార వైసీపీ చెబుతోంది. మొదటి మూడు విడతల్లో ఏకగ్రీవాలతో కలిపి 7వేల 869 పంచాయతీలను సొంతం చేసుకోగా.. నాలుగో విడతలో కూడా మోజార్టీ సీట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటు ప్రతిపక్ష టీడీపీ ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేసినా.. మెజార్టీ సీట్లు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ పార్టీ సపోర్ట్‌తో నిలబడిన నేతలు ఎక్కువ చోట్ల ఓడిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇటు బీజేపీ, జనసేన కూటమి బలపరిచిన కొంత మంది అభ్యర్థులు కూడా పలు చోట్ల గెలిచారు.

తుది విడత ఎన్నికల్లో 3 వేల 299 పంచాయతీలకు నోటిఫికేషన్‌ ఇస్తే 554 సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 33 వేల 435 వార్డు మెంబర్లకు 10 వేల 921 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రెండు వేల 743 సర్పంచ్‌, 22 వేల 423 వార్డు మెంబర్‌ పదవులకు ఎన్నికలు జరిగాయి. నాలుగో విడతలో మొత్తం 82.85 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం నాలుగు విడతలను పరిగణనలోకి తీసుకుంటే 81.78 శాతం పోలింగ్‌ నమోదైంది. కృష్ణా జిల్లాలో గరిష్టంగా 84.97శాతం, విజయనగరం జిల్లాలో 64.02 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.

మొత్తం నాలుగు విడతలను చూస్తే రెండు వేల 197 సర్పంచులు, 47 వేల 459 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 10 సర్పంచ్‌, 675 వార్డు మెంబర్‌ స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ ఎన్నికల్లో రెండు కోట్ల 26 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు ఎస్ఈసీ నిమ్మగడ్డ మీడియా ముందుకు రానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై వివరణ ఇవ్వనున్నారు.