కరోనా తెచ్చిన తిప్పలు, పిజ్జాలు అమ్ముకోవడం కోసం కార్నివాల్ డ్యాన్సులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మనిషి జీవితాన్ని తలకిందులు చేసింది. చాలా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎన్నో కంపెనీలు, సంస్థలు ఆర్థికంగా నష్టపోయాయి. కరోనా దెబ్బకు ప్రముఖ పిజ్జాల డెలివరీ రెస్టారెంట్ చెయిన్ పాపా జాన్స్(papa johns) కూడా తీవ్రంగానే నష్టపోయింది. కరోనా రాకతో పిజ్జాలు తినే వారు తగ్గిపోయారు. గతంలోలా ఆర్డర్లు రావడం లేదు. దీంతో పిజ్జాలు అమ్ముకునేందుకు పాపా జాన్స్ నానా తిప్పలు పడుతోంది.

Carnival performers delivering pizza

పిజ్జాల విక్రయం కోసం పాపా జాన్స్ సరికొత్త ఐడియా వేసింది. అదే కార్నివాల్ డ్యాన్స్. అవును, జనాలను ఆకర్షించి పిజ్జాలను సేల్ చేసుకునేందుకు పాపా జాన్స్ కార్నివాల్ డ్యాన్స్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం నాటింగ్ హాల్ కార్నివాల్ కు చెందిన ప్రదర్శకులను అద్దెకు తెచ్చుకుంది. నాటింగ్ హిల్ లో ఉండే స్థానికులు డిన్నర్ తో పాటు కార్నివాల్ డ్యాన్స్ ను వెబ్ సైట్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. అంటే పిజ్జాతో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా లభిస్తుందన్న మాట. ఎవరైనా పిజ్జా ఆర్డర్ చేస్తే వారి ఇంటికి పిజ్జా డెలివరీ బాయ్ తో పాటు కార్నివాల్ డ్యానర్లు కూడా వెళ్లారు. కస్టమర్ కి పిజ్జా ఇవ్వడంతో పాటు కార్నివాల్ డ్యాన్స్ ప్రదర్శించి వారిని ఎంటర్ టైన్ చేస్తారన్న మాట. కాగా, పిజ్జాకు మాత్రమే డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. ఇక
పాపా జాన్స్ పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తోంది. కరోనా కారణంగా ఆతిథ్య రంగంలో ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయం చేసేందుకు నిధులు సేకరిస్తోంది.

Wings

పిజ్జాలు అమ్ముకునేందుకు పాపా జాన్స్ పడుతున్న తంటాలు చూసి నెటిజన్లు అయ్యో పాపం అని జాలి చూపిస్తున్నారు. కరోనా ఎంత పని చేసింది అని వాపోతున్నారు. ఎంతో మందికి ఉపాధి, తిండి లేకుండా చేసిన మాయదారి కరోనా మహమ్మారి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని అంతా ఎదురుచూస్తన్నారు. మరి, పాపా జాన్స్ వేసిన ఈ కార్నివాల్ డ్యాన్సుల ఐడియా ఏ మేరకు సక్సెస్ అవుతుందో, వారికి ఏ మాత్రం బిజినెస్ పెంచుతుందో చూడాలి.

పాపా జాన్స్ అమెరికన్ పిజ్జా రెస్టారెంట్ ఫ్రాంచైజ్. ఇది యునైటెడ్ స్టేట్స్ లో నాల్గవ అతిపెద్ద పిజ్జా డెలివరీ రెస్టారెంట్ చైన్. లూయిస్ విల్లె శివారు ప్రాంతమైన కెంటకీలోని జెఫెర్సన్‌ టౌన్‌లో హెడ్ ఆఫీస్ ఉంది. 1984లో జాన్ షాట్నర్ దీన్ని స్థాపించాడు.

Related Posts