పేపర్ సేట్మెంట్..మీడియా సమావేశాలతో లాభం లేదు – కేశినేని ట్వీట్ కలకలం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓ వైపు అమరావతి పోరాటం..మరోవైపు మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది.‘మన కలలు మనమే సాకారం చేసుకోవాలి..మన కలలు ఎదుటి వారు సాకారం చేయలని కోరుకోవడం అవివేకం. అమరావతి @ncbn ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కల అది. అది సాకారం కావాలంటే..2024లో @JaiTDP అధికారంలోకి రావాలి. ఆ దిశగా..పార్టీలో అందరూ పాటుపడాలి..మీడియా సమావేశాల వల్ల, పేపర్ సెట్మెంట్ వల్ల ప్రయోజనం లేదు’ అంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం కేశినేని చేసిన ఈ ట్వీట్ ఎవరని ఉద్దేశించి చేశారు ? అనే దానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ రద్దు చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సవాల్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డెడ్ లైన్ కూడా విధించారు. ఈ విషయాన్ని వైసీపీ లైట్ గా తీసుకుంది. అయినా..ఈ విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని..ప్రెస్ మీట్ లు పెట్టి..అమరావతి గురించి వాస్తవాలు ప్రజలకు తెలియచేస్తానని..బాబు వెల్లడించారు. ప్రస్తుతం కేశినేని చేసిన వ్యాఖ్యలు..బాబును ఉద్దేశించి చేశారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.అమరావతి రాజధానికి మద్దతుగా ఆందోళనలు ఇవ్వాలని బాబు ఇచ్చిన పిలుపుపై భిన్నంగా స్పందిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే..రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. రాజధాని అంశంలో కేంద్ర పాత్ర ఉండదని, రాష్ట్ర రాజధానుల నిర్ణయం ఆయా ప్రభుత్వాల పరిధిలోని అంశమని కేంద్రం వెల్లడించింది.ఈ మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. 2015లో అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020, జులై 31వ తేదీన ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులని ప్రకటించింది. వికేంద్రీకరణ చట్టానికి అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది.
Related Posts