లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

కన్నీటి ఙ్ఞాపకం : కచ్చులూరు పడవ ప్రమాదం..ఏడాది పూర్తి, రమ్యశ్రీ ఎక్కడ ?

Published

on

Godavari boat accident :పాపికొండలు.. ఓ అందమైన ప్రదేశం.. అక్కడికి వెళ్ళాలని, ప్రకృతి అందాలను చూసి తరించాలనుకునే వారికి ఓ స్వర్గథామం. కానీ ఏడాది క్రితం అదే పాపికొండలు చూడటానికి వెళ్లిన పర్యాటకుల్ని గోదావరి బలి తీసుకుంది. కచ్చలూరులో సౌందర్య గోదారి.. ప్రమాద సవారిగా మారడంతో 51మంది జల సమాధి అయ్యారు. ఆ కన్నీటి ఙ్ఞాపకం తల్చుకుంటూ ఇప్పటికీ బాధిత కుటుంబాలు బోరుమంటూనే ఉన్నాయి. కచ్చులూరు మహా విషాదం జరిగి ఏడాదైన సందర్భంగా 10tv కథనం.తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూ మంద దగ్గర జరిగిన పడవ ప్రమాదానికి అప్పుడే ఏడాది అయ్యింది. రమణీయమైన గోదావరి ప్రయాణం… మహావిషాదంగా మారి నేటితో ఏడాది పూర్తయ్యింది. కచ్చులూరు ప్రమాదం తలచుకుంటేనే.. నాటి విషాద దృశ్యాలు కళ్లముందు కదలాడుతుంటాయి. సరదాగా పాపికొండల అందాలు తిలకించేందుకు బయలుదేరిన విహారయాత్ర.. విషాద యాత్రగా మారింది.

77మందితో దేవీపట్నం నుంచి పాపికొండల పర్యాటకానికి బయలుదేరిన రాయల్ వశిష్ఠ బోటు ..రెండు గంటల వ్యవధిలోనే కచ్చులూరు మందం సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఒకరిద్దరు కాదు ఏకంగా 51మంది గోదావరి ఉగ్రరూపానికి బలైపోయారు. మొత్తం 77మందిలో 26మందిని స్థానికులు రక్షించగలిగారు. మిగిలిన వాళ్లంతా జలసమాధి అయ్యారు. 48మంది మృతదేహాలు బంధువులకు అప్పగించగా.. మరో ముగ్గురి జాడ ఇప్పటికీ దొరకలేదు.బోటు ప్రమాదం జరిగిన రోజు నుంచి 38 రోజుల తర్వాత మృత దేహాల ఆచూకీ దొరికింది. ఈ సమయంలో బాధిత కుటుంబాలు పడ్డ బాధ వర్ణనాతీతం. ఉబికి వచ్చే కన్నీళ్లతో, ఆర్తనాదాలతో పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. తమ వాళ్లు ఎక్కడో అక్కడ చిక్కుకుని ప్రాణాలతో ఉంటారని బాధిత కుటుంబాలు ఆశగా ఎదురుచూశాయి. కానీ వాళ్ల ఆశలు ఫలించలేదు. తమ వాళ్ల మృతదేహాలు చూసి గుండెలవిసేలా రోధించారు.

ఆడుకుంటూ విషపు పాముపిల్లను మింగేసిన పిల్లాడు


కచ్చులూరు బోటు ప్రమాదం ఘటన.. ఇటు తెలంగాణలోనూ విషాదం నింపింది. మంచిర్యాల జిల్లాకు చెందిన రమ్యశ్రీ మృతదేహాం ఇప్పటికీ చిక్కలేదు. దీంతో నాటి విషాదాన్ని తల్చుకుంటూ ఇప్పటికీ ఆమె కుటుంబం కన్నీరుమున్నీరవుతూనే ఉంది. అటు వరంగల్‌ జిల్లాలోనూ బాధిత కుటుంబాలు చేదు ఙ్ఞాపకాన్ని తల్చుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి.ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటును ధర్మాడి సత్యం టీమ్‌… దాదాపు 38 రోజుల తర్వాత వెలికి తీసింది. లంగర్లు వేశారు.. యాంకర్లు నీళ్లల్లోకి వదిలారు.. స్ట్రాంగ్‌ రోప్‌లను కట్టారు. మొదట ప్రయత్నాలు ఫలించకపోయినా ఆ తర్వాత ధర్మాడి టీమ్‌ బోటును బయటకు తీయడంలో సక్సెస్ అయింది.
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న చందంగా కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి.అధికారుల నిర్లక్ష్యం, అనుమతులు లేకుండా లాంచీలు నిర్వహణ, నిర్వాహకుల ధనార్జన వెరసి… పర్యాటకుల ప్రాణాలు గోదావరిలో కలిసిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కచ్చులూరు ప్రమాదం ఎప్పటికీ ఒక విషాదగీతికలానే మిగిలిపోనుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *