Parents commit suicide after daughter dies

కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

చెరుకుపల్లికి చెందిన అన్నపరెడ్డి రాము (40) తిరుపతమ్మ (35) దంపతులు. వీరి కుమార్తె మార్కులు సరిగా రావడం లేదని 2 నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. కూతురు మృతి తట్టుకోలేక తల్లిండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.

కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 
 

Related Posts