నిత్యావసర వస్తువుల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం : ఉల్లి, ఆలు ఇక నిత్యావసరాలు కాదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులో ఒకటైన నిత్యావసర వస్తువుల (సవరణ) బిల్లు 2020ను మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును లోక్‌సభ సెప్టెంబర్ 15న ఆమోదించింది. ఈరోజు రాజ్యసభ కూడా ఆమోదించడంతో పార్లమెంటు ఆమోదాన్ని ఈ బిల్లు పొందినట్లు అయింది. ఇక రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ బిల్లు చట్టంగా మారితే.. ఉల్లి, నూనెలు, పప్పులు, తృణధాన్యాలను నిత్యావసర వస్తువుల జాబితాను తొలగించవచ్చు.


.

యుద్ధం వంటి ప్రత్యేక పరిస్థితులు, అసాధారణంగా ధరలు పెరగడం వంటి సందర్భాల్లో తప్ప చిరు ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలు సహా పలు నిత్యావసర వస్తువుల నిల్వ, సరఫరాపై ఎలాంటి నియంత్రణలూ ఉండబోవన్నది నిత్యావసర సరకుల చట్టసవరణ ప్రధానోద్దేశం.

ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించే ముందు వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి దాన్వే రావుసాహెబ్ దాదారావు మాట్లాడుతూ .. నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులను వృధా అవ్వకుండా నిరోధించడానికి ఈ సవరణ అవసరమని అన్నారు. ఈ సవరణ రైతులకు మాత్రమే కాకుండా వినియోగదారులకు, పెట్టుబడిదారులకు కూడా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని, ఖచ్చితంగా మన దేశాన్ని స్వావలంబన దిశగా మళ్లిస్తుందని ఆయన తెలిపారు. .

Related Posts