Parliament Visitor Passes Suspended Amid Coronavirus Scare

కరోనా భయం….పార్లమెంట్ విజిటర్ పాస్ ల జారీ నిలిపివేత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ దృష్ట్యా పార్లమెంట్ విజటర్ పాస్ ల జారీని నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విజిటర్ పాస్ ల జారీ సస్పెండ్ చేసే నోటిఫికేషన్ పై లోక్ సభ సెక్రటరీ జనరల్ శ్రీవాత్సవ సంతకం చేశారు. దేశవ్యాప్తంగా కరోనాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ విజిటర్ పాస్ ల జారీ ప్రాక్టీస్ ను నిలిపివేస్తున్నట్లు ఆ నోటిఫికేషన్ లో తెలిపారు.

పార్లమెంట్ సభ్యులు పబ్లిక్ గ్యాలరీ పాస్ లు జారీ చేయాలని రికమండ్ చేయకూడదు మరియు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ గ్రౌండ్ ను చూపించేందుకు టెండర్ రిక్వెస్ట్ లు చేయకూడదని ఈ నోటిఫికేషన్ ద్వారా కోరారు. సభ్యుల సహకారం అభ్యర్థించబడినట్లు ఆ నోటిఫికేషన్ లో ఉంది. 

మరోవైపు కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలను తగ్గించాలని,సమావేశాలను కుదించాలని కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ తో సహా పలువురు ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతన్న బడ్జెట్ సెషన్ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్-3న ముగియనుంది. అయితే బడ్జెట్ సమావేశాలను కుదించే విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి సూచన ఇవ్వలేదు. మరోవైపు మార్చి-16,2020న తమ లోక్ సభ ఎంపీలందరూ సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. 

మరోవైపు భారత్ లో కూడా కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 107కి చేరింది. ఎక్కువగా మహారాష్ట్రలో 31పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ఢిల్లీ,కర్ణాటక సహా భారత్ లోని చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్ మూసివేశారు. వీలైనంతవరకు ప్రజలు తమ ప్రమాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని,ప్రస్తుత సమయంలో ప్రయాణాలు చేయడం రిస్క్ తో కూడుకున్న పనేనని భారత ప్రభుత్వం సూచించింది.

Related Tags :

Related Posts :