తల్లి పాలు ప్యాశ్చరైజ్ చేసి కరోనాను పోగొట్టొచ్చు: స్టడీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తల్లి పాలు ప్యాశ్చరైజ్ చేసి అందులో ఉన్న కరోనా వైరస్ ను పోగొట్టచ్చని కొత్త స్టడీ బయటపెట్టింది. ‘నిజానికి తల్లి పాల నుంచి కరోనా వైరస్ పిల్లలకు సోకుతుందనే దానిలో ఎటువంటి కన్ఫర్మేషన్ లేకపోయినా కరోనా ఉంటే రిస్క్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది’ అని స్టడీ లీడ్ చేసిన ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో ఉండే గ్రెగ్ వాకర్ అనే రచయిత అంటున్నారు.

‘జర్నల్ ఆఫ్ పిడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్’ లో పబ్లిష్ చేసిన స్టడీ ప్రకారం.. ఆస్ట్రేలియాలో తల్లి పాలు దొరికే ఐదు బ్యాంకులు ఉన్నాయి. కొవిడ్-19మహమ్మారి వాప్తి జరుగుతున్న సమయంలోనూ ఈ తల్లి పాల బ్యాంకులకు సెలవుల్లేవు. తల్లి పాలతో మాత్రమే పెరిగే శిశువుల ఆకలి తీర్చాయి.

గతంలో మహమ్మారి వైరస్ లు ఎదుర్కొన్నాం. అందుకే మరోసారి అలా జరగకుండా సేఫ్టీ పద్ధతులు మొదలుపెట్టాం. పాలను ప్యాశ్చరైజేషన్ చేసి SARS-CoV2ను ఇన్‌యాక్టివేట్ చేశారు. తల్లి పాలలో ఒకవేళ కొవిడ్-19 వైరస్ ఉన్నా దాని కంటే పవర్ ఫుల్ వైరస్ ను ల్యాబ్‌లో వాడుతున్నారు. వీటి గురించి పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాం’ వాకర్ అన్నారు.

తల్లి పాలను 4డిగ్రీల సెల్సియస్ వద్ద లేదా 30 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచితే అందులోని SARS-CoV2ను ఇన్‌యాక్టివేట్ చేస్తుంది. కోల్డ్ స్టోరేజిలో సాధారణ ఉష్ణోగ్రత వద్ద 48గంటల పీరియడ్ సమయం ఉంచితే ఇన్ఫెక్టియస్ వైరస్ ఏ మాత్రం ప్రభావం చూపించలేదని తెలిసింది. పాలను గడ్డకట్టించడం ద్వారా వైరస్ ను తగ్గించగల్గుతున్నాం’ అని వారు వెల్లడించారు.

జులై కంటే ముందు కెనడీ స్టడీ ఓ జర్నల్ లో పాలను ప్యాశ్చరైజ్ చేసి అందులో ఉన్న కొవిడ్-19వైరస్ ను తగ్గించొచ్చని తెలిపింది.

Related Posts