20 ఏళ్ల యువతి పై పాస్టర్ అత్యాచారం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

paster:చిత్తూరు జిల్లాలో ఓ పాస్టర్ 20 ఏళ్ల యువతిపై బెదిరించి అత్యాచారం చేశాడు. ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్ కు వెళితే …… పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో బాధిత యువతి సోమవారం జిల్లా ఏఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు వివరాలను బాధిత యువతి తల్లి బుధవారం ఆస్పత్రివద్ద విలేకరులకు చెప్పటంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది.

చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన యువతి (20) తిరుపతిలో పాస్టర్ గా ఉన్న దేవసహాయంకు చెందిన రెయిన్ బో క్లినిక్ ప్రోడక్ట్ కంపెనీలో సెప్టెంబర్ 4వ తేదీన ఉద్యోగంలో చేరింది. అక్టోబర్ 3వతేదీ సాయంత్రం పాస్టర్ కారులో వచ్చి సరుకు డెలివరీ ఇవ్వాలి రమ్మని పిలిచాడు. రేణిగుంట సమీపంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.దిశ పోలీసు స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేయబోతే….. అంత పెద్దవాళ్ళతో నువ్వు పోరాడలేవు… సిమ్ కార్డు మార్చుకుని ఇంకో ఉద్యోగం చేసుకుని బతుకు అని సలహా ఇచ్చారని తెలిపింది. సోమవారం ఏఎస్పీ సుప్రజకు స్పందనలో ఫిర్యాదు చేయగా….గాజులమాండ్యం పోలీసు స్టేషన్ కు పంపారు. ఎస్ఐ కేసు నమోదు చేసుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

 

Related Posts