పవన్, రానా ఫిక్స్!.. డైరెక్టర్ ఎవరంటే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Pawan Kalyan – Rana Daggubati: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. వివరాళ్లోకి వెళ్తే.. మలయాళంలో అద్భుత విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది.


నటసింహం బాలయ్య బాబుతో రీమేక్ చేయాలని నిర్మాత ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. తర్వాత పవన్, రవితేజ పేర్లు వినిపించాయి కానీ ఏ కాంబో సెట్ అవలేదు. తాజాగా ఈ రీమేక్‌లో యాక్ట్ చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు వార్తలు వస్తున్నాయి.


ఈ మల్టీస్టారర్ మూవీలో మరో క్యారెక్టర్ కోసం యువ హీరో రానాను అప్రోచ్ అవగా అతను కూడా ఓకే చెప్పాడని సమాచారం. కానీ డైరెక్టర్ ఎవరనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. పవన్-రానాల క్రేజీ కాంబోను డీల్ చేయడానికి దర్శకుడిగా అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని పేర్లు వినబడుతున్నాయి. ఈ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో మరి.


Related Tags :

Related Posts :