మెగాస్టార్ సినిమా అనౌన్స్ చేసిన పవర్ స్టార్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Pawan Kalyan Confirms Chiru New Movie: అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాను తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. చిరంజీవి కొరటాల శివ ‘ఆచార్య’ తర్వాత వరుసగా సినిమాలు సెట్ చేశారు. త్రివిక్రమ్, సుజీత్, వినాయక్, హరీష్ శంకర్, మెహర్ రమేష్ ఇలా పలువురు దర్శకులతో చిరు సినిమాలు చేయనున్నారని వార్తలు వచ్చాయి.చిరంజీవి పుట్టినరోజు నాడు కొత్త సినిమా ప్రకటన వస్తుందని అనుకున్నారు. కానీ చిరు-మెహర్ రమేష్ కాంబినేషన్ పై ప్రకటన రాలేదు. అయితే మెహర్ రమేష్ మాత్రం, ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేస్తానంటూ మూడేళ్లుగా కథ కోసమే కష్టపడుతున్నానని ప్రకటించాడు. ఓవైపు చిరంజీవి-మెహర్ కాంబినేషన్‌లో సినిమా గురించి అధికారిక ప్రకటన రాకపోయినా.. ఆ సినిమా ఉందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ కన్‌ఫర్మ్ చేసేశారు.

ట్విట్టర్ ద్వారా పవన్ ఈ ప్రకటన చేయడం విశేషం. నిన్న (సెప్టెంబర్ 2) పవన్ పుట్టినరోజు సందర్భంగా ‘‘వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ రెండు ఫొటోలు షేర్ చేశాడు మెహర్ రమేష్. ఆ ట్వీట్‌కి ఈరోజు రిప్లై ఇచ్చారు పవన్. తనకు శుభాకాంక్షలు చెప్పినందుకు థ్యాంక్స్ చెబుతూనే.. చిరంజీవితో చేయబోయే సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ విధంగా చిరంజీవి కన్‌ఫర్మ్ చేయకపోయినా.. చిరు-మెహర్ కాంబోను పవన్ ప్రకటించేశారు.తమిళ్‌లో అజిత్ నటించిన సూపర్ హిట్ ‘వేదాళం’ సినిమాను తెలుగులో రీమేక్ చేసే బాధ్యతను మెహర్ రమేష్‌కు అప్పగించారు చిరు. ఇప్పటికే తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో చేయాల్సిన మార్పులు చేర్పులు చేసిన మెహర్.. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. అంతలోనే పవన్ ఇలా ఈ ప్రాజెక్టును ప్రకటించారు. ‘ఓ పిట్టకథ’ సినిమా ఫంక్షన్‌లో చిరు పొరపాటున ‘ఆచార్య’ టైటిల్ చెప్పేశారు. ఇప్పుడు పవన్ కూడా అన్నయ్యలానే వార్తల్లో వినిపిస్తోన్న సినిమాను చిరు కంటే ముందుగా అనౌన్స్ చేయడం విశేషం.
Related Posts