చెప్పిందేంటి, చేస్తోందేంటి?:గంజాయి కాలుస్తూ.. ఫుల్ బాటిల్ లేపుతూ.. మాధవిలతకు పవన్ ఫ్యాన్స్ కౌంటర్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

LADY Teaser gone Viral: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీర వినయ విధేయురాలు, బీజేపీ లీడర్, నటి మాధవీలత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన షాకింగ్ పోస్ట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆమెపై కోపంగా ఉన్నారు. ఇంతలో వారికి ఆమెని తిట్టడానికి మరో అవకాశం దొరికింది.మాధవీలత నటిస్తున్న ‘లేడి’ సినిమా టీజర్ శనివారం విడుదల చేశారు.ఇటీవల ఆమె టాలీవుడ్‌ ఇండస్ట్రీ పార్టీ కల్చర్ గురించి, డ్రగ్స్ వ్యవహారం గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘లేడి’ టీజర్ ఆమె వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా ఉంది.


టీజర్లో గంజాయి కాలుస్తూ, ఫుల్ బాటిల్ లేపుతూ కనిపించింది మాధవీలత.. ‘‘తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటి సారి ఆమె డిప్రెషన్‌ని ఆవిడే సినిమా గా తీసుకోబోతుందా?.. A Mono Play Feature Film’’ అంటూ మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.


ఈ టీజర్ చూసిన పవన్ ఫ్యాన్స్.. నువ్వు పవన్ కళ్యాణ్‌కు సలహాలివ్వడం కాదు.. డ్రగ్స్ గురించి వ్యాఖ్యలు చేసి, నువ్వు గంజాయి కాలుస్తూ మందు తాగుతూ నటించడం ఏంటి?.. దీని ద్వారా సభ్యసమాజానికి ఏం సందేశమిద్దామనుకుంటున్నావ్?.. అంటూ కౌంటర్ ఇస్తున్నారు.కాగా ‘లేడి’ మానసిక సంఘర్షణతో డిప్రెషన్‌కులోనై సూసైడ్ చేసుకోవాలనుకునే ఓ కథానాయిక కథగా తెలుస్తోంది.

My LADY MOVIE TEASERWatch with Full VOLUMEA Roaring #LadyTiger In & AsTeaser Out Now…

Actress Maadhavi यांनी वर पोस्ट केले शनिवार, ५ सप्टेंबर, २०२०

Related Posts