pawan kalyan fires on cm jagan

కేసుల్లో ఉన్నవారు సీఎం అయితే ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అద్భుతాలు జరుగుతాయని తాను పార్టీ పెట్టలేదన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. సీఎం అయిపోతాననే పగటికలలు తాను కనలేదన్న ఆయన…తాను తన ఒక్కడి గుర్తింపు,

అద్భుతాలు జరుగుతాయని తాను పార్టీ పెట్టలేదన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. సీఎం అయిపోతాననే పగటికలలు తాను కనలేదన్న ఆయన…తాను తన ఒక్కడి గుర్తింపు, విజయం కోరుకోలేదన్నారు. 
25 ఏళ్ల కమిట్ మెంట్ తో రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్‌.. అందరి కష్టాలు మాట్లాడే బలమైన పార్టీ మన కోసం కావాలన్నారు. అలాంటి పార్టీ అధికారంలో వస్తే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కేసుల్లో ఉన్నవారు పరిపాలిస్తే ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందని పవన్ ప్రశ్నించారు.

పార్టీల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టకూడదని పవన్ అన్నారు. మన మీద కేసులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ధైర్యం సరిపోదన్నారు. ఏదన్నా మాట్లాడదామంటే సీబీఐ కేసులు భయంతో సైలెంట్ గా ఉండిపోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రానికి నీళ్లు రావాలన్నా.. ప్రాజెక్టులు రావాలన్నా.. బలంగా మాట్లాడలేరని చెప్పారు. అలాంటి వ్యక్తులు సీఎంలు అయితే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నది సందేహమే అని పరోక్షంగా సీఎం జగన్‌పై విమర్శలు చేశారు పవన్. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రాజెక్టులపై బలంగా మాట్లాడలేకపోయారని.. ఆయనకు సీబీఐ కేసుల భయం ఉందని పవన్ అన్నారు.

జగన్, చంద్రబాబుతో వ్యక్తిగతంగా తనకు విభేదాలు లేవన్నారు పవన్. గెలుపు, వ్యక్తిగత లబ్ది కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. వాళ్లు ఏం చేసినా తాను పట్టించుకోనని.. కానీ ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు స్పందిస్తాను అన్నారు. విశాఖలో జరిగిన కోడికత్తి కేసు ఏమైందని పవన్ ప్రశ్నించారు. జగన్ బాబాయ్ వివేకా హత్యకు గురైతే ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయారని విమర్శించారు.

Related Posts