లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

పార్టీ కోసం నిలబడే వారి కోసం ప్రాణాలిస్తా : పవన్ కళ్యాణ్

Published

on

pawan kalyan meeting : పార్టీ కోసం నిలబడే కోసం ప్రాణాలైనా ఇస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్డు మీదకు వెళ్లగానే వేల మంది వస్తారని…వారి ప్రేమను ఇష్టపడతానని చెప్పారు. కానీ మనం కోసం నిలబడే పది మందికి ప్రాణాలిస్తానని చెప్పారు. అలాంటి వ్యక్తుల కోసం వెతికానని అన్నారు. 2019 ఎన్నికల్లో బాధ్యతలు అప్పజెప్పిన కొత్త నాయకత్వమే క్రియాశీల సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఖర్చుకు జనసైనికులు ఎప్పుడూ వెనకాడలేదన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. క్రియాశీల పార్టీ సభ్యత్వం విజయవంతంగా పూర్తి చేసిన ఐదు నియోజకవర్గాల నేతలతో సమావేశం అయ్యారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. పార్టీ నిర్మాణంపై ఎనిమిది నెలల తర్వాత సమావేశం చేపట్టారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశంలో చర్చించారు.


దర్శకుడిపై అభిమానం : ఒక్క రూపాయికే క్వార్టర్ సీసా


జనసేన సమావేశంలో నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన తరపున గెలిచిన ఓకే ఒక్క రాజోలు ఎమ్మెల్యే పార్టీ తరపున పని చేయరని..రాజోలు ఎమ్మెల్యే రాపాక అధికార పార్టీ కోసం పని చేస్తారని విమర్శించారు. కానీ రాజోలులో జనసేన పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *