లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

పవన్.. అనుకున్నదేంటి.. అవుతున్నదేంటి..?

Published

on

Pawan Kalyan: రెండేళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పవర్ స్టార్.. వచ్చీ రాగానే సూపర్ ఫాస్ట్‌గా సినిమాలు సైన్ చేశారు. అసలు ఒకేసారి సంవత్సరంలో రెండు సినిమాలు రిలీజ్ చెయ్యాలని పక్కా ప్లాన్ వేసుకున్నారు. కమిట్ అయిన సినిమాల్లో ఒక్కటి కూడా కంప్లీట్ కాలేదు. అసలు పవన్ కళ్యాణ్ అనుకున్నదేంటి..? అవుతున్నదేంటి..?

ఓకేసారి రెండు సినిమాలు

బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరమే 2 సినిమాలు రిలీజ్ చేద్దామనుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే కరోనాతో షూటింగ్‌కి బ్రేక్ పడడంతో ‘వకీల్ సాబ్’, క్రిష్ రెండు సినిమాలు ఆగిపోయాయి. ఈ సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ అనుకున్న పవన్ కళ్యాణ్ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. ఈ సినిమాలు.. నెక్ట్స్ ఇయర్‌కి పోస్ట్ పోన్ అయ్యాయి.

Vakeel Saab Motion Poster: Pawan Kalyan looks ready to bring on justice | Telugu Movie News - Times of India

ఎన్నికల ఎఫెక్ట్

రెండు సినిమాలు ప్యార్లర్‌గా ప్లాన్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘వకీల్ సాబ్’ ఫస్ట్ ఫినిష్ చేసి రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యి షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ షూట్ అవ్వకుండా.. అంతలోనే మళ్లీ ఆంధ్రాలో పొలిటికల్ టూర్లు వెయ్యడంతో మళ్లీ సినిమాకు బ్రేక్ పడింది. అంతేకాదు హైదరాబాద్ స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పారు జనసేనాని. ఇంకో 15 రోజుల్లో ఎలక్షన్లు పెట్టుకుని ఇంక షూటింగ్‌కి ఎలా వస్తారని డౌట్ పడుతున్నారు సినీ జనాలు .


నిహారిక పెళ్లి

‘వకీల్ సాబ్’ సినిమా ఆల్ మోస్ట్ 90 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. మిగిలిన ప్యాచ్ వర్క్ చేసేస్తే సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకుంటున్నారుటీమ్. కానీ నవంబర్ నెలాఖరు వరకూ హైదరాబాద్‌లో ఎలక్షన్స్ హడావిడి, ఆ తర్వాత డిసెంబర్ 9 న రాజస్థాన్ లో మెగా డాటర్ నిహారిక పెళ్లి. మరి ఈ గ్యాప్‌లో షూటింగ్‌కి పవన్ కళ్యాణ్ వస్తారా..? అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూట్ కంప్లీట్ చేస్తారా అంటే కష్టమే.


మరో రెండు సిినిమాలు

‘వకీల్ సాబ్’, క్రిష్ తో చెయ్యాల్సిన సినిమా కంప్లీట్ అవగానే పవన్ కళ్యాణ్ కి ‘గబ్బర్ సింగ్’ తో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అంతలోపే రీసెంట్‌గా సాగర్ చంద్రతో కమిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ సినిమా స్టార్ట్ చేస్తారని కూడా టాక్ నడుస్తోంది.

ఇలా సినిమా తర్వాత సినిమా పూర్తి చేసి మళ్ళీ కంప్లీట్‌గా పాలిటిక్స్ మీద కాన్సన్‌ట్రేట్ చెయ్యాలనుకున్న పవన్ కళ్యాణ్ ప్లాన్స్ ఇప్పుడు మొత్తం గందరగోళంగా మారినట్టు తెలుస్తోంది. ఈ సిచ్యువేషన్‌లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిటైన సినిమాలను పూర్తి చేయగలరా..? అన్న డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు సినీ వర్గాల వారు అలాగే పవన్ అభిమానులు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *