బాలయ్య తేల్చలేదు.. పవన్ ఫిక్స్ చేశాడు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Balakrishna – Pawan Kalyan:
సాధారణంగా సినిమా పరిశ్రమలో కొందరు హీరోలు రిజెక్ట్ చేసిన కొన్ని కథలు, మేకర్స్ సెట్ చేసిన కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కుదరకపోవడం.. అనివార్య కారణాల వల్ల ఆయా ప్రాజెక్టుల్లోకి ఇతరులు రావడం వంటి ఘటనలు చాలానే జరుగుతుంటాయి. ఇలా, నటసింహం నందమూరి బాలకృష్ణ చేయాల్సిన రెండు సినిమాలు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్నారనే ఆసక్తికరమైన వార్త ఫిలిం వర్గాల్లో వినిపిస్తోంది.

వివరాళ్లోకి వెళ్తే.. హిందీ ‘పింక్’ తెలుగు రీమేక్ ను మొదట బాలయ్య హీరోగా చేయాలనుకున్నారు మేకర్స్. ఈ మేరకు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు కూడా.. బాలయ్య ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో నిర్మాతలు పవన్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేశారు. ‘పింక్’ తమిళ్ రీమేక్ ‘నేర్కొండపార్వై’ లో స్టార్ హీరో అజిత్ నటించగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది.

క్రేజీ రీమేక్ కూడా పవన్ ఖాతాలోకే!
రీసెంట్ క్రేజీ రీమేక్స్‌లో కొంతకాలంగా టాలీవుడ్‌లో వినిపిస్తున్న పేరు.. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’.. మలయాళంలో అద్భుత విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించడానికి ప్రముఖ నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రైట్స్ సొంతం చేసుకుంది. చాలా రోజులుగా బిజు మీనన్ చేసిన ఎస్‌ఐ క్యారెక్టర్ బాలయ్య చేస్తాడని వార్తలొచ్చాయి. బాలయ్య ఎందుకో ఆసక్తి చూపలేదని, రానా నటిస్తానంటే ఆలోచిస్తానన్నాడనే మాటలూ వినిపించాయి. తర్వాత పృథ్వీరాజ్ రోల్ రానా చేస్తాడనీ అన్నారు.

రవితేజ, పవన్ కళ్యాణ్ ఇలా పలువురు హీరోల పేర్లు వినిపించాయి. ఎట్టకేలకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నట్లు దసరా సందర్భంగా అధికారికంగా ప్రకటించేశారు నిర్మాతలు. దీంతో బాలయ్య ఎటూ తేల్చక హోల్డ్‌లో పెట్టిన ‘వకీల్ సాబ్’, ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రెండు రీమేక్స్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లిపోయాయి..

Related Tags :

Related Posts :