pawan kalyan sensational comments on cm jagan caste

మతం మారినా మీ పేరులో రెడ్డి ఎందుకు..? : ఏడుకొండలకు తప్ప అన్నింటికీ వైసీపీ రంగులేశారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ని వదలడం లేదు. ప్లేస్ ఏదైనా సందర్భం ఏదైనా టార్గెట్ మాత్రం సీఎం జగనే. జగన్ మతం, కులం గురించి పవన్ పదే పదే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ని వదలడం లేదు. ప్లేస్ ఏదైనా సందర్భం ఏదైనా టార్గెట్ మాత్రం సీఎం జగనే. జగన్ మతం, కులం గురించి పవన్ పదే పదే ప్రశ్నిస్తున్నారు. తాజాగా తిరుపతిలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన పవన్.. సీఎం జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మతాన్ని మార్చుకున్న జగన్ కులాన్ని ఎందుకు వదలడం లేదని పవన్ ప్రశ్నించారు. జగన్.. మీ పేరులో ఇంకా రెడ్డి ఎందుకు అని నిలదీశారు. మతం మారాక కూడా కులం పేరు ఎందుకు ఉంచుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు పవన్. ”సీఎం జగన్ క్రిస్టియానిటీ తీసుకున్నారు. అయినా ఆయన పేరు చివరలో రెడ్డి కులం పేరును మాత్రం తొలగించలేదు. నా పేరులో నాయుడు లేదు. కానీ వైసీపీ వాళ్లు పవన్ నాయుడు అని పిలుస్తున్నారు. అది వాళ్ల ఇష్టం” అని పవన్ అన్నారు.

ఓట్ల కోసం మతం, కులం, డబ్బు కావాలంటే కుదరదని పవన్ అన్నారు. వేరే మతంలో ఉన్నా రాజకీయం కోసం కులాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. సహనంతో ఉండాలని మీ మతం చెబుతున్నప్పుడు ఎదుటివారిై దాడులెందుకు అని పవన్ ప్రశ్నించారు. మాట తప్పని కులంలో పుట్టానని జగన్ అంటున్నారు.. మరి మతం మారినప్పుడు కులం ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు అని పవన్ ప్రశ్నించారు. వైసీపీది రంగుల రాజ్యం అన్న పవన్.. ఏడుకొండలకు తప్ప అన్నింటికీ వైసీపీ రంగులు వేశారని విమర్శించారు. ఓట్ల రాజకీయాలు చేయని రోజున, రైతులను ఇబ్బంది పెట్టని రోజున మాత్రమే జగన్ ను గౌరవిస్తాను అని పవన్ స్పష్టం చేశారు. అప్పటివరకు జగన్ రెడ్డి అనే పిలుస్తా అన్నారు.

ప్రభుత్వ తప్పిదాలపై పోరాడుతూనే ఉంటామని పవన్ తేల్చి చెప్పారు. తన దగ్గర ధైర్యం అనే ఖడ్గం మాత్రమే ఉందన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం కూడా మాకు భయపడుతుంది అని పవన్ అన్నారు. తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనపై పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తోలు ఊడేలా రేపిస్టులను చితకబాదాలని ఆవేశంగా మాట్లాడారు. తప్పు చేసిన వారికి సింగపూర్ తరహా శిక్షలు ఉండాలన్నారు. ఆడబిడ్డల మానప్రాణాలు రక్షించలేకపోతే 151 సీట్లు వచ్చి ఏం లాభం అన్నారు పవన్. కర్నూలులో యువతి హత్యోదంతంపై ప్రభుత్వం ఎందుకు స్పందిచలేదని పవన్ అడిగారు.

Related Tags :

Related Posts :