మీది పెద్దమనసు.. బన్నీ, చరణ్‌లకు పవన్ థ్యాంక్స్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Pawan Kalyan Tweet: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కటౌట్ క‌డుతుండగా క‌రెంట్ షాక్ త‌గ‌ల‌డంతో ముగ్గురు అభిమానులు మృతి చెందారు. మరో న‌లుగురు గాయ‌ప‌డ్డారు. వీరి కుటుంబాలకు పవన్‌తో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (రూ.2 లక్షలు), మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్(రూ.2.5 లక్షలు) ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే పవన్‌తో సినిమాలు చేస్తున్న, చేయబోతున్న నిర్మాతలు కూడా తమ వంతు సహాయం చేశారు.ఈ సందర్భంగా వారందరికీ పవన్‌ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ‘కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన రామ్‌ చరణ్‌కి, అలాగే పెద్దమనుసుతో ముందుకు వచ్చిన అల్లు అర్జున్‌కి, నిర్మాతలు.. దిల్ రాజు, ఏ.ఎమ్ రత్నం, మైత్రి మూవీస్ నవీన్‌ గార్లకు నా కృతజ్ఞతలు’ అని పవన్ ట్వీట్ చేశారు.
Related Posts