Home » పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. ర్యాలీలో బైక్లు ఢీకొని కార్యకర్తలకు తీవ్ర గాయాలు
Published
2 months agoon
By
bheemrajPawan Kalyan tour accident : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. నివార్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. నేడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఉయ్యూరులో తుపానుతో దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో పవన్ వెంట వెళ్తున్న కార్యకర్తల బైక్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు జనసేన కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స చేస్తున్నారు. కాగా.. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు పవన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో తుపాను బాధితుల కడగండ్లను తెలుసుకోవడానికి పవన్ పర్యటన చేస్తున్నారు. నివార్ తుపాన్ కారణంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శిస్తున్నారు. వారి కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడుతున్నారు. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని రైతులను పవన్ పరామర్శించనున్నారు.