జమిలీ ఎన్నికలపై పవన్‌ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Pawan Kalyan Comments Jamili elections : కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతోంది… 2024 కంటే ముందే ఎన్నికలొస్తాయి. ఆ ఎన్నికలకు అంతా సిద్దమవ్వాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలోకి రావాలంటే కేవలం పార్టీపై అభిమానం ఉంటే సరిపోదన్నారు. ఆ అభిమాన్ని ఓట్లుగా మార్చాలని పార్టీ శ్రేణులకు పవన్‌ దిశానిర్దేశం చేశారు.మంగళగిరిలో రెండు రోజులపాటు జరిగిన జనసేన సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ క్రియాశీల సభ్యత్వం పెంచుకోవడం, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని డిసైడ్‌ అయ్యారు. అధికారం రావాలంటే.. ప్రతిగ్రామంలోకి, ప్రతి వార్డులోకి పార్టీని తీసుకెళ్లాలని జనసేనాని పార్టీ శ్రుణులకు పిలుపునిచ్చారు.


ర్యాలీలో పాల్గొనకపోతే రుణమాఫీతో పాటు అన్ని పథకాలు కట్, విశాఖ వైసీపీలో ఆడియో టేప్ కలకలం


జమిలీ ఎన్నికలపై పవన్‌ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 2024 కంటే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశముందని జోస్యం చెప్పారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు రావాలన్నదే తన అభిప్రాయమని స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికలు వస్తే… వాటికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ప్రజల్లో జనసేనపైనున్న అభిమానాన్ని… ప్రభుత్వాన్ని స్థాపించేలా మార్చాలన్నారు. అప్పుడే అధికారం సాధ్యమవుతుందని తెలిపారు.అమరావతి పరిరక్షణ సమితి నేతలతో పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. అమరాతి ఉద్యమకారులపై వైసీపీ నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బంగారం పెట్టుకుని ఉద్యమం చేయకూడదా అని ప్రశ్నించారు. ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకునే చేయాలా.. మంచి బట్టలు వేసుకున్నవారు చేస్తే అది ఉద్యమంకాకుండా పోతుందా అని దుయ్యబట్టారు. ఉద్యమానికి, సామాజిక వర్గానికి ముడిపెట్టడం సరికాదన్నారు.రాజధాని రైతులకు న్యాయం చేసే విషయంలో ఎప్పటికీ వెనకడుగు వేసేదిలేదని పవన్‌ స్పష్టం చేశారురెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా కార్యకర్తలతో చర్చించారు. 42 నియోజకవర్గాల నేతలతో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్ల అధికారం లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

Related Tags :

Related Posts :