లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

తిరుపతిలో పవన్ కీలక వ్యాఖ్యలు : ఉప ఎన్నికల్లో పోటీపై వారం తర్వాత చెబుతా

Published

on

Tirupati Bypoll Soon : తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా? లేక బీజేపీ పోటీ చేస్తుందా? అనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేనాని. బీజేపీ కేంద్ర పెద్దలు ఇచ్చినంత మర్యాద.. రాష్ట్ర నాయకులు ఇవ్వడం లేదని పీఏసీ సభ్యులు అంటున్నారని తెలిపారాయన. కలిసి ప్రయాణించాలనుకున్నప్పుడు చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకోవాలని తెలిపారు జనసేన అధినేత. పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీపై వారం రోజుల్లో నిర్ణయిస్తామని తెలిపారాయన.

బీజేపీ రాష్ట్ర నాయకులు మర్యాద ఇవ్వడం లేదనే విషయం ఢిల్లీ పెద్దలకు తెలిపానని చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వాళ్లు చెప్పడంతో నేతల తీరు మారిందని చెప్పారు. తిరుపతి ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై అవగాహనకు వచ్చామని తెలిపారు పవన్ కల్యాణ్. జనసేన పోటీ చేస్తే తిరుపతి పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తానని తెలిపారాయన. గ్రేటర్‌ ఎన్నికల్లా తిరుపతి ఉపఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే మద్దతు ఇస్తామని తెలిపారు పవన్ కల్యాణ్. వారం రోజుల్లో ఎవరు పోటీ చేయాలనేది తేలుతుందని తెలిపారాయన.

మరోవైపు…తిరుప‌తి పార్లమెంటు స్థానానికి త్వర‌లో జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నికలో సత్తా చాటేలా ముందుకెళ్తోంది ప్రతిపక్ష టీడీపీ. అందులో భాగంగానే ధర్మ పరిరక్షణ యాత్ర చేపడుతోంది. గెలుపే లక్ష్యంగా అంద‌రికంటే ముందుగానే అభ్యర్థిని సైతం ప్రకటించిన టీడీపీ…కేడ‌ర్ నుంచి లీడ‌ర్ వ‌ర‌కూ అందరిని రంగంలోకి దించేసింది.