Home » ‘ఇండియన్లు కశ్మీర్ వస్తే రేప్ కేసులు పెరిగిపోతాయి’
Published
3 months agoon
By
subhnజమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ లీడర్ (PDP leader).. షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం పలు చట్టాలు చేసి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైనా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ లో స్థలం కొనుగోలు చేయొచ్చని చెప్పింది. దీనిపై పీడీపీ లీడర్.. పార్టీ చీఫ్ మెహబూబా మఫ్తీకి అత్యంత సన్నిహితుడు అయిన సురేంద్ర చౌదరి కామెంట్లు చేశారు.
దేశంలోని వ్యక్తులు జమ్మూ కశ్మీర్‌కు వచ్చి సెటిల్ అయితే.. రేప్ కేసులు మరిన్ని పెరిగిపోతాయని అన్నారు. ‘జమ్మూ అనేది చాలా ధనిక డోగ్రా సంప్రదాయాన్ని ఫాలో అవుతుంది. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశాం. మేం చెప్పేది బయటి వాళ్లు వచ్చి రేప్స్ లాంటి క్రైమ్‌లు చేస్తారని అనడం లేదు. అస్సాం, మహారాష్ట్రలు చెప్పిందే మేం చెప్తున్నాం. ఇంకా బయటి నుంచి వచ్చిన వాళ్లు ఉద్యోగాలు కూడా కొట్టేస్తారు’ అని చౌదరి అన్నారు.
ఇవాళ్టి రోజున జమ్మూ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది. జమ్మూలో చదువుకోవడానికి పలు గ్రామాల నుంచి యువతులు వస్తున్నారు. ఫరీదాబాద్ లో ఏం జరిగిందో తెలుసు కదా. యువతి అక్కడికక్కడే చనిపోయింది. హత్రాస్ ఘటనా తెలిసిందే. రేప్ కేసులు పెరుగుతున్నాయి. ఇవన్నీ నేషనల్ టీవీలో వస్తూనే ఉన్నాయి’ అని పీడీపీ లీడర్ అన్నారు.
మంగళవారం కేంద్రం పలు చట్టాలు చేసి జమ్మూ కశ్మీర్ లో స్థలాలు ఎవరైనా కొనుక్కోవచ్చని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రాకముందు అంటే ఆగష్టులో జమ్మూకశ్మీర్ నుంచి బయటిప్రాంతం వాళ్లు వచ్చి స్థలాలు కొనుగోలు చేయడానికి వీల్లేదు.