Home » కేంద్రం కీలక నిర్ణయం: ఒకేసారి ఆరునెలల రేషన్ తీసుకోవచ్చు
Published
12 months agoon
By
vamsiకరోనావైరస్ వ్యాప్తి చెందుతుండగా.. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ పొందే 75 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరు నెలల రేషన్‌ను ఒకేసారి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ ద్వారా ఆహార ధాన్యాలచను తీసుకునేవాళ్లు ఒకేసారి ఆరు నెలలకు సరిపడా తీసుకునేందుకు అనుమతించనున్నట్లు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ బుధవారం(18 మార్చి 2020) వెల్లడించారు.
ప్రస్తుతం, లబ్ధిదారులు గరిష్టంగా రెండు నెలల ముందుగానే ధాన్యాన్ని తీసుకుంటుండగా.. ఆరు నెలల కోటాను తీసుకోవచ్చని ఆయన చెప్పారు. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం ఆరు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తోందని, “గోడౌన్లలో తగినంత ఆహార ధాన్యాలు ఉన్నాయని, పేదలకు ఆరునెలల కోటా ధాన్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కోరాము” అని పాస్వాన్ చెప్పుకొచ్చారు.
కరోనా నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద రద్దీ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇప్పటికే ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా వ్యాప్తి కారణంగా సబ్సులు, ఫ్లోర్ క్లీనర్లు, థర్మల్ స్కానర్లకు డిమాండ్ పెరగడంతో వీటినీ నిత్యావసరాల చట్టం పరిధిలోకి తెస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే మాస్క్‌లను, హ్యాండ్ శానిటైజర్లను ఈ చట్టం పరిధిలోకి తెచ్చిందని ఆయన చెప్పారు.