తన సోదరితో స్నేహంగా ఉంటున్నాడని, గొంతుకోసి హత్య చేసిన అన్న

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తన సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో  ఒక వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన ఘటన ఉత్తర ఢిల్లీలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఒక నెయిల్ పాలిష్ పరిశ్రమలో పని చేస్తున్న సహోద్యోగులు.ఢిల్లీలోని షాబాద్ డెయిరీకి చెందిన ఆర్మాన్(22) బవానాలోని నెయిల్ పాలిష్ పరిశ్రమలో పని చేస్తాడు. అతనికి ఒక చెల్లెలు ఉంది. ధర్మేందర్ అనే వ్యక్తితో ఆమె  స్నేహంగా ఉంటోంది. వారిద్దరు సన్నిహితంగా ఉండటం అర్మాన్ కు నచ్చలేదు. ఈ విషయమై అర్మాన్ ధర్మేందర్ కు చెప్పాడు.  పెళ్లి కాకుండా స్నేహంగా, సన్నిహితంగా మెలగవద్దని హెచ్చరించాడు. ధర్మేందర్ ఈవిషయాన్ని పట్టించుకోకపోగా….. ఈ అంశంపై తన స్నేహితుల వద్ద వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

ఆ సంగతి తెలిసిన అర్మాన్ ధర్మేందర్ ను మరోసారి హెచ్చరించాడు. అప్పటికీ ధర్మందర్ అర్మాన్ మాటలు లెక్క చేయక, ప్రగల్భాలు పలికాడు. దీంతో కోపం పెరిగిన అర్మాన్ ధర్మేందర్ ను అంతమొందించాలనుకున్నాడు. రోహిణీలో నివసిస్తూ….తనతో పాటు పని చేసే, కరణ్ సింగ్ల(28) అనే మిత్రుడికి విషయం చెప్పాడు. తన చెల్లెలి పట్ల ధర్మేందర్ ప్రవర్తన గురించి..తదనంతరం జరిగిన విషయాలు వివరించాడు.ధర్మందర్ ను అంతమొందించాలని..అందుకు నీ సహకారం కావాలని కోరాడు. కరణ్ అందుకు అంగీకరించాడు. ఇద్దరూ కల్సి ధర్మేందర్ ను గొంతు కోసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. తగిన సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమీషనర్ గౌరవ్ శర్మ తెలిపారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఒక కత్తి, మోటారు సైకిల్, స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.

Related Tags :

Related Posts :