ఆ లెజెండ్ ప్లేయర్ జెర్సీ రూ.26లక్షలు

ఆ లెజెండ్ ప్లేయర్ జెర్సీ రూ.26లక్షలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అభిమాన ఆటగాడి గ్లౌజులు, బ్యాట్, జెర్సీ ఇలా ఏదైనా సొంతం చేసుకోవాలనే కుతూహలంతో ఎంత వెచ్చించడానికైనా ఆలోచించరు. ఇటీవల ఇటలీలో జరిగిన వేలంలోనూ బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్ ప్లేయర్ పీలె జెర్సీ కూడా అంతే క్రేజ్‌తో అమ్ముడుపోయింది. 

ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న పీలె జెర్సీని 30వేల యూరోలు అంటే రూ.26లక్షలకు అమ్ముడుపోయింది. 92 అంతర్జాతీయ గేమ్ లలో 77గోల్స్ తో ప్రదర్శన చేసిన పీలె.. తన కెరీర్లో ఆఖరి సారిగా బ్రెజిల్ కు ఆడాడు. 

1971వ సంవత్సరంలో రియో డి జెనీరోలోని మారాకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో యుగోస్లోవియాతో ఆడినప్పుడు వేసుకున్న జెర్సీని వేలంలో ఉంచారు. అదే వేలంలో మరో జెర్సీ అంటే 25వేల యూరోలకు ఇటాలియన్ సైక్లింగ్ స్టార్ ఫాస్తో కొప్పీ జెర్సీకి దక్కింది. 

 

ఈ వేలంలో ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా సీనియర్ మారడోనా 1971వ సంవత్సరం యూఈఎఫ్ఏ కప్ టోర్నమెంట్ లో ఆడినప్పుడు జెర్సీ 9వేల 4వందల యూరోలకు అమ్ముడుపోయింది. అమెరికన్ బాస్కెట్ బాల్ గ్రేట్ మైకేల్ జోర్డాన్ బ్యాటా్ 425యూరోల ధర మాత్రమే పలికింది. 

Related Posts