లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ట్రంప్,‌ నాకంత పవర్ లేదు.. నీ ఓటమిని మార్చలేను

Published

on

Donald Trump: అమెరికాకు రెండో సారి ప్రెసిడెంట్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన ట్రంప్.. దేశ చరిత్రలోనే ఎవరూ ఊహించని ఘటనకు కారణమయ్యాడు. సపోర్టర్లను రెచ్చగొట్టిన ట్రంప్‌ తీరు.. ఆ దేశ చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్‌ బిల్డింగ్‌పైనే దాడి చేసే వరకూ తీసుకొచ్చింది. అదే సమయంలో రిపబ్లికన్‌ పార్టీకే చెందిన వైస్ ప్రెసిడెంట్ మైక్‌ పెన్స్‌ నిర్ణయం ప్రజాస్వామ్య భావనకు, రాజ్యాంగ నిబద్ధతకు తిరుగులేని నిదర్శనంగా నిలిచింది.

ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను లెక్కించి విజేతను అధికారికంగా ప్రకటించే జాయింట్‌ కాంగ్రెషనల్‌ సెషన్‌ సమావేశానికి.. దేశ ఉపాధ్యక్షుడైన పెన్స్‌ అధ్యక్షత వహిస్తారు. ఫెయిల్యూర్ తప్పించుకోవాలని శతవిధాల ప్రయత్నించిన ట్రంప్‌.. తమ పార్టీకే చెందిన మైక్‌ పెన్స్‌ను పావుగా వాడుకోవాలనే ప్లాన్ వేశారు. ఎన్నికల ఫలితాలను తిప్పి పంపే అధికారం పెన్స్‌కు ఉందంటూ ట్రంప్‌ బహిరంగంగానే ట్వీట్‌ చేశారు.

‘సరైన’ చర్య తీసుకోవాల్సిందిగా బుధవారం నాటి కాంగ్రెస్‌ సమావేశానికి ముందు కూడా ట్రంప్‌, వైస్ ప్రెసిడెంట్ అన్యాపదేశంగా సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు రాసిన లేఖలో తన నిర్ణయాన్ని పెన్స్‌ స్పష్టం చేశారు.

‘నవంబర్‌ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో అవకతవకలు జరిగాయని.. కొన్ని రాష్ట్రాల ఫలితాలను పట్టించుకోవద్దంటూ కొందరు రిక్వెస్ట్ చేశారు. అభ్యంతరాలను లేవనెత్తి, అందుకు తగిన ఆధారాలను సమర్పించే చట్టబద్ధమైన హక్కును ఆమోదిస్తాను. ఐతే ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారిగా రాజ్యాంగానుసారం వ్యవహరిస్తానని ప్రమాణం చేశాను. లీగల్‌గా వచ్చిన ఎలక్టోరల్‌ ఓట్లను పరిగణించకుండా చేసే పవర్ నాకు లేదు. వారి డిమాండుకు ఆమోదముద్ర వేయరాదనే నిర్ణయానికి వచ్చాను’ ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

రీసెంట్‌గా జరిగిన పరిణామాలతో రెండోసారి అధ్యక్షుడిగా అధికారం చేపట్టే మాట అటుంచి.. అగ్రరాజ్య చరిత్రలోనే చీకటి అధ్యాయం అనే సంఘటనలకు కారకుడనే చెడ్డపేరును ట్రంప్‌ మూటకట్టుకున్నాడు. ట్రంప్‌ ఓటమిని తిరగరాసే అధికారం తనకు లేదంటూ మైక్‌ పెన్స్‌ నిష్కర్షగా చేసిన ప్రకటన కూడా అమెరికా చరిత్రలో అతని విజ్ఞతకు, నిజాయితీకి నిదర్శనంగా నిలిచిపోతుంది.