నూతన్ నాయుడు ఫ్యామిలీ అంటే ఆ ఏరియాలో హడల్.. వాళ్లను బహిష్కరించాలంటూ గతంలో పోస్టర్లు కూడా వేశారట!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Pendurthi People Shocking Allegations on Nutan Naidu’s Family: బిగ్‌బాస్ సీజన్‌ 2 కంటెస్టెంట్‌ నూతన నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నూతన నాయుడు తనను శిరోముండనం చేశారని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్‌ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనతో నూతన్ నాయుడు కుటుంబం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెందుర్తిలో మొదటినుంచి నూతన్ నాయుడు కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. నూతన్ నాయుడు అతని భార్య మధుప్రియల గురించి కథలు కథలుగా చెప్తున్నారు అక్కడి ప్రజలు.మధుప్రియది దూకుడు స్వభావమని, చిట్టీల పేరుతో చీటింగ్ చేయడం, డబ్బులు వడ్డీలకివ్వడంతో పాటు పలు మోసాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలున్నాయట. వీరి ఆగడాలు మితిమీరడంతో విసిగిపోయిన అక్కడి ప్రజలు ఒకానొక సమయంలో ‘వీళ్లు మంచివాళ్లు కాదు.. నమ్మి మోసపోవద్దు.. వారిని బహిష్కరించండి’ అంటూ ఊరంతా పోస్టర్లు కూడా వేశారట.కాగా ప్రస్తుతం శ్రీకాంత్ విషయంలో వివరాలు తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నిస్తుండగా నూతన్ నాయుడు తప్పించుకు తిరుగుతున్నాడు. శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు నూతన్ నాయుడు భార్య మధుప్రియపై ఏ 1గా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Posts