పెందుర్తి శిరోముండనం కేసులో దర్యాప్తు వేగవంతం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖ జిల్లా పెందుర్తి శ్రీకాంత్ శిరోముండనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసులో ప్రధాన నిందితులు నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియ, ఇందిర, వరహాలు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని 2 రోజుల పాటు ప్రశ్నించనున్నారు.

బాధితుడు శ్రీకాంత్, ఇందిర మధ్య ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు ప్రధాన కారణమైన ఇందిర ఫోన్ లోని ఫోటోలనే శ్రీకాంత్ వాట్సప్ స్టేటస్ గా పెట్టుకోవటంతోనే శ్రీకాంత్ ఫోన్ దొంగిలించాడనే ఆరోపణతో నిందితులు శిరోముండనం కు పాల్పడ్డారు.అసలింతకూ ఆఫోన్ లో ఏముంది అనే దానిపై పోలీసులు దృష్టి పెట్టనున్నారు. శ్రీకాంత్ ను ఇంటికి పిలిచి ఒక రబ్బరు ట్యూబ్ లాంటి వస్తువుతో ఇందిర, శ్రీకాంత్ ను కొట్టటం, అతని స్నేహితుడితోనే శిరోముండనం చేయించటం…వంటి దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజి లో బయట పడ్డాయి.

ఆవు పేడలో పుట్టి పెరిగా..కరోనా నన్నేం చేస్తుంది?: మంత్రి గారి ధీమా


ముఖ్యంగా ఇందిర ఈ కేసులో కీలకంగా మారుతుందని భావిస్తున్నారు. శ్రీకాంత్ నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసే సమయంలోనే ఇందిర, శ్రీకాంత్ లకు పడేది కాదని పోలీసులు గుర్తించారు. శ్రీకాంత్ అక్కడ పనిమానేసిన నెల రోజుల తర్వాత ఫోన్ పోయిందంటూ శ్రీకాంత్ ను పిలిచి శిరోముండనం చేశారు.

Related Posts