తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిటిషన్ వేశారు. సచివాలయం కూల్చాలన్న తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా ఆదేశాలు ఇవ్వొద్దని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై న్యాయస్థానంలో ప్రభుత్వానికి చిక్కులు తప్పడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే సచివాలయ భవనాలు కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈరోజు తెలంగాణ హైకోర్టు కూడా తాత్కాలికంగా కూల్చివేత భవనాలను నిలిపివేసింది. పర్యావరణ పరిరక్షణ నిబంధనలను కూడా పూర్తిగా ఉల్లంఘించారు. దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకున్నారో పూర్తి వివరాలను తెలిపాలంటూ హైకోర్టు…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవనాల కూల్చివేతకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.

గత నెల 29 సచివాలయ భవనాలు కూల్చివేతకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దానిపై కూడా స్టే ఇవ్వాలని జీవన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు అవకాశం ఉంది.

Related Posts