ఆల్కహాల్ దొరక్కపోతే పెట్రోల్ వాడి ఇన్ఫెక్షన్ పోగొట్టుకోవాలంటోన్న అక్కడి ప్రెసిడెంట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగొ ద్యుటర్జీ.. పేదలకు విలువైన సూచనలు ఇచ్చారు. మాస్క్‌లు డిసెన్ఫెక్ట్ చేయడానికి పెట్రోల్ వాడమంటుననారు. గతవారం చేసిన కామెంట్ కాంట్రవర్సీ అయింది. గ్యాసోలిన్ లేదా డీజిల్ తో మాస్క్ తో సహా చేతిని ముంచండి’ కొవిడ్ ఏ కోశానా నిలబడలేదు. ఈ కామెంట్ ను ప్రెసిడెంట్ జోక్ చేశారంటూ హెల్త్ మినిస్ట్రీ కొట్టపారేసింది. ఎంతో కష్టపడి కవర్ చేసుకుంటే శుక్రవారం మరోసారి పేద ప్రజలకు సొల్యూషన్ అంటూ మరో సూచన చేశారు.ఇక జోక్ అని మళ్లీ కవర్ చేసుకోవడానికి లేదు పాపం. దీనిపై ఓ టీవీ రిపోర్టరు మీకేమైనా పిచ్చా అని అడిగితే.. నేను పిచ్చోడ్ని అయితే నువ్వే ప్రెసిడెంట్ వి అవ్వాలి నేను కాదు. నేను చెప్పింది నిజం. ఆల్కహాల్ అందుబాటులో లేకపోతే ప్రత్యేకించి పేదలకు గ్యాసోలిన్ స్టేషన్ కు వెళ్లి గ్యాస్ ను డిస్ఇన్ఫెక్షన్ చేయడానికి వాడాలని అన్నారు.

ద్యుటర్జీ ప్లానింగ్ విషయంలో చాలా స్పెషల్. కానీ, ఇంటర్నేషనల్ గా అతని మాటలకు విమర్శలు వస్తుంటాయి. మానవ హక్కుల సంబంధిత విషయాల్లో వాదనలు తప్పలేదు. ఆ దేశంలో మార్చి నుంచి లాక్ డౌన్ ప్రకటించగా.. ఆగష్టు మధ్య వరకూ కొనసాగనుంది. దేశంలో ఇప్పటివరకూ 89వేల 374మందికి ఇన్ఫెక్షన్స్ సోకింది.

Related Posts