లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఫుడ్ ఆర్డర్ చేసిన చిన్నారి..ఇంటిముందు క్యూ కట్టిన 30మంది డెలివరీ బాయ్స్

Published

on

Philippines girl slow internet affect 42 orders Delivery : 7 సంవత్సరాల చిన్నారి తన బామ్మ కోసం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసింది. పాపం బామ్మకు తొందరగా ఫుడ్ పెట్టాలనుకున్న ఈ చిన్నారి తపన షాక్ కు గురిచేసింది. ఏకంగా 30మంది డెలివరీ బాయ్స్ ఇంటిముందు క్యూ కట్టారు. 42 ఫుడ్ ఆర్డర్ ప్యాకెట్స్ పట్టుకుని ఇంటి ముందు నిలబడ్డారు.ఏంటీ..ఒక్క ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇంతమంది వచ్చారేంటి అని పాపం ఆ చిన్నారి బిక్కమొహం వేసింది. తరువాత అసలు విషయం తెలిసి ఏం చేయాలో తెలీక గాబరాపడిపోయింది. ఇంతకీ ఏంజరిగిందంటే..ఫిలిప్పీన్స్‌కు చెందిన ఏడేళ్ల బాలిక తనకోసం..తన బామ్మ కోసం కొన్నిరోజుల క్రితం ఆన్‌లైన్‌లో రెండు ఫుడ్‌ ఆర్డర్‌ చేసింది. ఇంటర్‌నెట్‌ స్లోగా ఉండటంతో కన్ఫర్మేషన్‌‌ ఆప్షన్ ను పదేపదే ప్రెస్ చేసింది. అలా కొంతసేపటికి కాలింగ్ బెల్ మోగటంతో ఫుడ్ డెలివరీ వచ్చిందని హుషారుగా వెళ్లి డోర్ తీసింది. అంతే ఒక్కసారిగా షాక్ అయ్యింది.ఇంటి ముందు క్యూలో నిలబడ్డ డెలివరీ బాయ్‌లను చూసి ఖంగుతింది. 30 మంది బాయ్స్‌ ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకుని ఆర్డర్ చేసిన ఆమె కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. వాళ్లు అలా 42 ఫుడ్‌ ఆర్డర్లను తెచ్చి ఆమె ముందు ఉంచారు.దీంతో బాలికకేమీ అర్థం కాలేదు. ఫోన్‌లో తను చేసిన ఆర్డర్ల లిస్ట్‌ను ఓపెన్‌ చేసి చూసి అసలు విషయం తెలిసి షాక్‌ అయ్యింది. మొత్తం 42 ఆర్డర్లు చేసినట్లుగా చూపించింది. ఇంటర్‌నెట్‌ స్లో వల్లనే ఇదంతా జరిగిందని తెలుసుకుంది. కానీ అన్ని ఫుడ్ ప్యాకెట్స్ ను ఏం చేయాలో తెలియలేదు.ఈ విషయం తెలిసిన ఇరుగు పొరుగింటి వారు వచ్చి..వీలైనన్ని​ ఆర్డర్లకు సరిపడా డబ్బులిచ్చి ఆ ప్యాకెట్లను పట్టుకెళ్లారు. ఆ చిన్నారి పొరుగింట్లో ఉండే సుఆరెజ్‌ అనే మహిళ ఇదంతా వీడియో తీసి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అదన్నమాట అసలు విషయం..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *