లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

గోవా డిప్యూటీ సీఎం ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్ లకి పోర్న్ వీడియోలు

Published

on

Phone Hacked, Asleep When Obscene Clip Sent: Goa Deputy CM గోవా డిప్యూటీ సీఎం ఫోన్ నుంచి ఆయన సభ్యుడిగా ఉన్న వాట్సాప్ గ్రూప్ లలోకి ఫోర్న్ వీడియోలు రావడం కలకలం రేపింది. డిప్యూటీ సీఎం చంద్రకాంత్ బాబు కవేల్కర్ ఫోన్ నుంచి సోమవారం తెల్లవారుజామున సోషల్ యాక్టివిస్టుల వాట్సాప్ గ్రూప్ లలోకి పోర్న్ వీడియోలు షేర్ చేయబడ్డాయి. ఈ విషయం బయటకు రావడంతో గోవాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.వెంటనే డిప్యూటీ సీఎంపై చర్యలు తీసుకోవాలంటూ గోవా కాంగ్రెస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గోవా ఫార్వాడ్ పార్టీ మహిళా విభాగం కూడా డిప్యూటీ సీఎంపై పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేశారు. వీడియో పూర్తిగా కామంతో కూడుకున్నది. లైంగిక మరియు అసభ్యకరమైన కంటెంట్ కలిగి ఉంది. ఆ వీడియోను కవేల్కర్ ఒక పబ్లిక్ గ్రూపులో పంచుకున్నాడు. అలా చేయడం వల్ల విలేజెస్ ఆఫ్ గోవా గ్రూప్‌లోని మహిళా సభ్యులు మనస్తాపం చెందారు’ అని ఉమెన్స్ వింగ్ తమ ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


రేప్ సీన్ వీడియోలు వైరల్ : ఆ పాత్రలో నటించిన నటి ఆత్మహత్యాయత్నం


మరోవైపు, తన ఫోన్ ని ఎవరో దుండగులు హ్యాక్ చేసి ఇలా చేశారని, తనకు ఏ పాపం తెలియదని డిప్యూటీ సీఎం కవేల్కర్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తన కంప్లెయింట్ లో….. నా ఫోన్‌ను హ్యాక్ చేసి ఎవరో ఈ పని చేశారు. వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలి. నేను చాలా వాట్సాప్ గ్రూపులలో మెంబర్‌గా ఉన్నాను. ఫోన్ హ్యాక్ చేసిన వాళ్లు కావాలనే ‘విలేజెస్ ఆఫ్ గోవా’ గ్రూపులో ఆ క్లిప్‌ను ఫార్వర్డ్ చేశారు. మిగతా ఏ గ్రూప్‌కు ఈ క్లిప్ పంపలేదు. ఆ క్లిప్.. గ్రూప్ ‌లో సోమవారం ఉదయం 1:20 గంటలకు ఫార్వర్డ్ అయింది. ఆ సమయంలో ఫోన్ నా దగ్గర కూడా లేదు. నేను అప్పటికే నిద్రపోతున్నాను. గతంలో కూడా నా పేరును, నా పరువును కించపరచడానికి మరియు ప్రజల ముందు నన్ను తప్పుగా నిలబెట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. నేరపూరితంగా కావాలనే నా ఫోన్ హ్యాక్ చేసిన దుర్మార్గులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎదుర్కోలేక ఈ పని చేసి.. ఉన్నతమైన డిప్యూటీ సీఎం పదవిని కించపరిచారు అని కవేల్కర్ అన్నారు.కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన కవేల్కర్ గతేడాది బీజేపీలో చేరారు. ప్రస్తుతం ప్రభుత్వంలో నెం.2గా కొనసాగుతున్నారు. ఆయన బీజేపీలో చేరకముందు గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *