Ayodhya Deepotsav 2022: దీపకాంతుల్లో ధగధగ మెరిసిన అయోధ్య నగరం.. దీపోత్సవ్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ (ఫొటో గ్యాలరీ)

Ayodhya Deepotsav 2022: అయోధ్య నగరం దీపకాంతుల్లో ధగధగ మెరిసిపోయింది. ప్రతీయేటా దీపావళికి ముందురోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ్ కార్యక్రమాన్నినిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో సరయు నది ఒడ్డున లక్షలాది దీపాలను వెలిగిస్తోంది. తాజాగా ఈ యేడాది సరయూ నది ఒడ్డున 15లక్షల మట్టి ప్రమిదలను వెలిగించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డును సృష్టించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని దీపోత్సవ్ ని తిలకించారు. దీపోత్సవ్ వేళ సుందరంగా తీర్చిదిద్దిన సరయూ నది ఒడ్డు వివిధ ఆకృతుల్లో అమర్చిన ఈ దీపాలను వెలిగించేందుకు 22వేల మంది వాలంటీర్లు సాయం చేశారు. సరయూ నది ఒడ్డునే కాకుండా అయోధ్యలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్లోనూ మరికొన్ని ప్రమిదలను వెలిగించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన మ్యూజికల్ లేజర్ షో అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. తాత్కాలిక రామాలయానికి వెళ్లి రామ్ లల్లాకు ప్రార్థనలు చేశారు. అక్కడ మట్టి దీపం వెలిగించి "ఆరతి" ఇచ్చారు. అదేవిధంగా సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి వద్ద 3డి హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోతో పాటు గ్రాండ్ మ్యూజికల్ లేజర్ షోను ప్రధాని మోదీ వీక్షించారు.

1/29Ayodhya Deepotsav
2/29Ayodhya Deepotsav
3/29Ayodhya Deepotsav
4/29Ayodhya Deepotsav
5/29Ayodhya Deepotsav
6/29Ayodhya Deepotsav
7/29Ayodhya Deepotsav
8/29Ayodhya Deepotsav
9/29Ayodhya Deepotsav
10/29Ayodhya Deepotsav
11/29Ayodhya Deepotsav
12/29Ayodhya Deepotsav
13/29Ayodhya Deepotsav
14/29Ayodhya Deepotsav
15/29Ayodhya Deepotsav
16/29Ayodhya Deepotsav
17/29Ayodhya Deepotsav
18/29Ayodhya Deepotsav
19/29Ayodhya Deepotsav
20/29Ayodhya Deepotsav
21/29Ayodhya Deepotsav
22/29Ayodhya Deepotsav
23/29Ayodhya Deepotsav
24/29Ayodhya Deepotsav
25/29Ayodhya Deepotsav
26/29Ayodhya Deepotsav
27/29Ayodhya Deepotsav
28/29Ayodhya Deepotsav
29/29Ayodhya Deepotsav