photographer-killed-in-ananthapuram-due-to-illegal-affair

అక్రమ సంబంధంతో ఫోటో గ్రాఫర్ హత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

photographer killed in ananthapuram:ఆడ,మగ స్నేహం అది గౌరవంగా, సక్రమంగా గడిచినంత కాలం బాగానే ఉంటుంది. కానీ అది ఏ బలహీనమైన క్షణానైనా అక్రమ సంబంధంగా మారిందంటే దాని వల్ల ఉత్పన్నమ్యయ్యే పరిస్ధితులతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అనంతపురం జిల్లాలో ఒక ఫోటోగ్రాఫర్ అక్రమ సంబంధం వల్ల ప్రాణాలు కోల్పోయాడు.

కళ్యాణదుర్గం మండలం మంగళకుంట గ్రామానికి చెందినన మహమ్మద్ రఫీ అనే ఫోటోగ్రాఫర్ కొన్నాళ్లుగా అనంతపురంలో నివసిస్తున్నాడు. రామ్ నగర్ 80 ఫీట్ రోడ్డులో ఇల్లు తీసుకున్నాడు.అదే ప్రాంతంలో ఉండే ఒక మహిళతో రఫీకి పరిచయం ఏర్పడింది. అపరిచయం క్రమేపి అక్రమ సంబంధానికి దారి తీసింది.గత రెండేళ్లుగా వీళ్లిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా రెండేళ్లుగా రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. తమ కామవాంఛలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి అక్రమ సంబంధం ఎన్నాళ్లో దాగలేదు. బయటపడింది. ఈ క్రమంలో రఫీ హత్యకు గురయ్యాడు.

రఫీని హత్య చేసింది నేనే అంటూ గోపీ అనే వ్యక్తి అనంతపురం ఫోర్త టౌన్ పోలీసు స్టేషన్ లో లోంగిపోయాడు. కాగా…గోపీకి, రఫీకి ఏమిటి సంబంధం ? వీళ్లిద్దరి మధ్య వైరం ఏమిటీ ? రఫీ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు గోపీకి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి ?గోపీ రఫీని ఎందుకు హత్య చేశాడు. ఎవరైనా హత్య చేసి గోపీని ఇందులో ఇరికించారా ? లేక ఆర్ధికపరమైన కారణాలు ఉన్నాయా ? అని వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎన్ని నిజాలు బయట పడనున్నాయో వేచి చూడాలి.

Related Posts