Home » పామును మింగిన పక్షి.. పొట్ట చీల్చుకుని ఎలా బైటకొచ్చిందో చూడండీ..!!
Published
3 months agoon
By
Chandu 10tvEel comes out Heron’s Stomach : అమెరికాకు చెందిన సామ్ డేవిస్ అనే ఓ పోటోగ్రాఫర్ కొన్నిరోజుల క్రితం మేరీ ల్యాండ్ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అరుదుగా కనిపించే వన్య ప్రాణులను ఫోటోలు తీసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సమయంలో గాల్లో ఎగురుతున్న హెరాన్ (నారాయణ పక్షి) ఆయనకు కంటపడింది. అందులో వింతేముంది అనుకుంటున్నారా? అయితే సామ్ దాన్ని తదేకంగా చూసే సరికి పొట్ట కింది భాగంలో ఏదో ఒక పాము వేలాడుతూ కనిపించింది.
మెుదట హెరాన్ పొట్టకు ఆ పాము అతుక్కొని ఉందని భావించాడు. కానీ, అది దగ్గరకు వచ్చిన తర్వాత చూసి ఒక నిమిషం పాటు నిర్ఘాంతపోయాడు. హెరాన్ మింగిన స్నేక్ ఈల్ దాని పొట్టను చీల్చుకుని బయటకు రావటమే కాకుండా అలా గాల్లో పక్షితో పాటు ఎగురుతూ ఉంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఫోటోగ్రాఫర్ సామ్ మాట్లాడుతూ.. ఈ స్నేక్ ఈల్స్ అనేవి ఈల్ జాతికి చెందినవి. ఇవి ఎక్కువగా సముద్ర తీరాల్లోని బురద, ఇసుక ప్రాంతాల్లో నివాసముంటాయి. ఇవి ఏదైనా జీవి వీటిని సజీవంగా తిన్నప్పుడు అవి తమ పదునైన తోకను ఉపయోగించి బయటపడడానికి ప్రయత్నిస్తాయి.
పొట్టలో జీర్ణం కాకుండా ఉండటానికి ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈల్ స్నేక్ పొట్టను చీల్చినా హెరాన్ బ్రతికి ఉండడమనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా అయితే అంత పెద్ద గాయం అయిన తర్వాత ఏజీవైనా చనిపోతుంది. కానీ హెరాన్ బతికి ఉండటం చాలా గొప్ప విషయమని సామ్ అన్నాడు.