PORNసైట్‌లో స్టూడెంట్లు, లెక్చరర్ల ఫొటోలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పొర్నోగ్రఫీ వెబ్ సైట్లో కాలేజీ స్టూడెంట్లతో పాటు, లెక్చరర్ల ఫొటోలు అప్ లోడ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా అకౌంట్లలో ఫొటోలు డౌన్ లోడ్ చేసి పోర్న్ వెబ్ సైట్‌కు అమ్మేశారు. సంబంధిత కేసుపై యాక్షన్ తీసుకున్న పోలీసులు ఆ సైట్లలో ఫొటోలు తొలగించేలా చేశారు.

‘సీసీబీ సైబర్ క్రైమ్ వింగ్ ఇద్దరిని అరెస్టు చేసింది. పోర్న్ సైట్లలో ఫొటోలు అప్ లోడ్ చేసిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. వారు ఆ ఫొటోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి డౌన్ లోడ్ చేసినట్లుగా తెలుస్తోంది. కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకుంటామని’ సీనియర్ ఆఫీసర్ సందీప్ పాటిల్ అన్నారు.

సోషల్ మీడియాను స్టూడెంట్లు మిస్ యూజ్ చేస్తుండటంతో ఓ స్టూడెంట్స్ గ్రూప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీ స్టూడెంట్లు వారి సోషల్ స్పేస్ గురించి భయాందోళనకు గురవుతున్నారని బెంగళూరు స్టూడెంట్ కమ్యూనిటీ పోలీసులకు లెటర్ ద్వారా తెలిపారు.

బాధితులు ఎవరైతే ఉన్నారో వారి తప్పు లేకుండానే ఇది జరిగింది. వారికి అందించాల్సిన సపోర్ట్ సిస్టమ్ చాలా కీలకంగా పనిచేయాల్సి ఉంటుంది. బాధితులకు కుటుంబాల నుంచి సపోర్ట్ అందాలని కోరుకుంటున్నా. మేం చాలా టైం వరకూ ఇంట్లోనే గడుపుతున్నాం. పేరెంట్స్ ఎంత బాగా రెస్పాండ్ అయితే అంత మంచిది అని జామ్యా అనే స్టూడెంట్ అంటున్నారు.

Related Posts