లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

కొవిడ్ వచ్చినా.. కిటికీలో నుంచే పెళ్లి

Published

on

పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాక కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అయినా మ్యారేజ్ వాయిదా వేయలేదు. సాధారణంగా అయితే కరోనా వచ్చిందని భయపడి ఆందోళన చెందుతుంటే ఆ కపుల్ క్రియేటివ్ గా ఆలోచించింది. వినూత్న పద్ధతిలో పెళ్లి తంతు పూర్తి చేసుకుని ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

కాలిఫోర్నియాలో ఉండే పాట్రిక్ డెల్గాడో, లారెన్ జిమెనెజ్ లు నవంబరులో పెళ్లి చేసుకోవాలని డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ, ఆమెకు పెళ్లి డేట్ కు మూడు రోజుల ముందే కొవిడ్ పాజిటివ్ వచ్చింది. పెళ్లి సమయానికి ఆమె ఐసోలేషన్లో ఉండాల్సిన పరిస్థితి.ఆ టైంలోనూ డెకరేటెడ్ రిబ్బన్ చెరోవైపు పట్టుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. నిజానికి ఒకరి చేతిలో ఇంకొకరు చేయివేసి చేసుకోవాల్సిన పెళ్లి తంతు అలా ముగించేశారు. కాకపోతే ఆమె పెళ్లి కూతురి గెటప్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉండగా పెళ్లికొడుకు ఆ కిటికీ ఎదురుగా నిల్చొని పెళ్లి చేసుకున్నాడు.

మా పెళ్లిని ఇలా చేసుకున్నాం. నేనూ పాట్రిక్ ఇలా మా ప్రేమను పంచుకున్నాం. టెస్టు రిజల్ట్స్ వచ్చాక కూడా తన పార్టనర్ నుంచి తనకు సపోర్ట్ దొరికిందని హ్యాపీగా ఫీలయింది పెళ్లి కూతురు. కరోనా మహమ్మారి సమయంలోనే చేసుకోవాల్సిన పెళ్లిని రెండు మూడు సార్లు వాయిదా వేసుకున్న వారు ఈ సారి అలా చేయకూడదని ఫిక్స్ అయి ఇలా ప్లాన్ చేసుకున్నారట.

నాలుగేళ్లుగా కలిసి ఉంటున్న వారికి మే 2019లో ఎంగేజ్ మెంట్ అయింది. 2020లో గ్రాండ్ గా పెళ్లి ప్లాన్ చేసుకున్న వారి పెళ్లి ఇలా పూర్తయిందట. ఈ పెళ్లితంతుపై సోషల్ మీడియాలో కాంప్లిమెంట్లు, కామెంట్లు ఫుల్ గా వస్తున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *