10పైసలకే బిర్యానీ..ఎగబడ్డ జనాలు..2 కిలోమీటర్ల క్యూ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

plate biryani for 10 paisa: బిర్యానీ..పేరు చెబితేనే నోరు ఊరిపోతుంది. తినాలంటే మాత్రం వందల్లో ఉంటుంది. 10పైలకే బిర్యానీ అంటే జనాలు ఎగబడకుండా ఉంటారా? ముఖ్యంగా బిర్యానీ ప్రియులు. ఎంత దూరమైనా సరే ఎగబడి మరీ వెళ్లి వెళ్లి కడుపునిండా లాగించేసి మరీ వస్తారు.


ఇంతకీ 10పైసలకే బిర్యానీ ఎక్కడా అంటారా?చెన్నైలోని కొన్ని హోటళ్లలో కేవలం పది పైసలకే బిర్యానీ అందిస్తున్నారు. నిన్న (అక్టోబర్ 11) World Biryani Day కావడంతో హోటళ్ల యాజమాన్యాన్నీ ముందే మీటింగ్ పెట్టుకుని 10పైసలకే బిర్యానీ అమ్మాలని తీర్మానించుకున్నాయ.

ఇంకేముంది? 10పైసల నాణాలే వినియోగంలో లేకున్నా 10పైసలకే బర్యానీ అని తెలసి జనాలు ఫ్యామిలీతో సహా ఎగబడి వచ్చేశారు. ఆయా హోటల్స్ ముందు క్యూ కట్టేశారు. ఎంత క్యూ అంటూ దాదాపు 2 కిలోమీటర్ల దూరం బారులు తీరి నిలబడ్డారు ఓటు వేయటానికి కూడా అంత ఓపిగ్గా నిలబడని జనాలు 10పైసలకే బిర్యానీ కోసం ఎంతో ఓపిగ్గా క్యూలో నిలబడ్డారు.


చెన్నై, మధురై, దింగిగల్, Trichy restaurantలో 10 పైసలకే బిర్యానీని విక్రయించారు. దీంతో హోటళ్ల ముందు భారీగా జనం ఎగబడ్డారు. కిలో మీటర్ల మేర బారులు తీరారు. బిర్యానీ మోజులో పడి కరోనా వస్తుందనే భయాన్ని కూడా మరచిపోయారు. కోవిడ్ నిబంధనల్ని తుంగలో తొక్కారు. కష్టమర్లు వాహనాలు పార్కింగ్ చేయటానికి ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులు వచ్చాయంటే రియాక్షన్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు.


అయితే కరోనా సమయంలో ఇలాంటి ఆఫర్లు పెట్టి జనాలు గుమిగడేలా చేసి ప్రజలకు కరోనాను అంటిస్తున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.అలాగే కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి బిర్యానీ ఆఫర్లను ప్రకటించిన వ్యాపారులపై మున్సిపల్‌ అధికారులు కేసు నమోదు చేశారు.

Related Tags :

Related Posts :