మట్టిలో ఆడుకునే పిల్లల్లో రోగనిరోధకత నెలలోపే పెరుగుతుందంట!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kids immunity: పిల్లలకు ఆటే ఆరోగ్యకరం.. ఆడుకుంటూనే పిల్లలు  ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు. అదే ప్రకృతి ఒడిలో ఆడుకునే పిల్లల్లో వ్యాధినిరోధక అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రకృతిసిద్ధమైన పర్యావరణంలో పిల్లలు ఆడుకోవడం ద్వారా వారిలో నెలలోపే వ్యాధినిరోధకత శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.అంతేకాదు.. కాంక్రీట్ తో కూడిన ప్లే గ్రౌండ్‌ల కన్నా మట్టితో కూడిన ఆట స్థలాల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి చర్మం తట్టుకోనేంత స్థాయిలో ఇమ్యూనిటీని పెంచుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది.

బహిరంగ ఆట స్థలాల్లో దుమ్ము, బురద వంటి ప్రదేశాల్లో ఎక్కువ సమయం ఆడుకునే పిల్లలు ఎక్కువగా ఆరోగ్యకరంగా ఉంటారని అధ్యయనం వెల్లడించింది.Finlandలోని University of Helsinki పరిశోధక బృందం పిల్లల ఆట స్థలాలపై అధ్యయనం చేసింది. రెండు ఫిన్నీస్ నగరాల్లోని 10 డేకేర్ సెంటర్లలో ఆడుకునే 3 ఏళ్ల నుంచి 5ఏళ్లలో 75 మంది చిన్నారులపై రీసెర్చర్లు అధ్యయనం చేశారు. మట్టి మైదానపు వాతావరణంలో మార్పుతో పాటు పిల్లల చర్మంపై మైక్రోబయోటాను ఎలా మార్చిందో పరీక్షించారు. పిల్లల రక్తంలో రోగనిరోధకశక్తి స్థాయిని పెరిగిందని గుర్తించారు.అందుకే.. నాలుగు డేకేర్ సెంటర్లలోని కాంక్రీట్ ప్లే గ్రౌండ్లను మట్టితో కూడిన గడ్డి మైదానాలుగా మార్చారు. మూడు డేకేర్ సెంటర్లను ఇప్పటికే మట్టి మైదానాలుగా మార్చేశారు. మరో మూడు సెంటర్లలో మాత్రం పాత కాంక్రీట్ ఆట స్థలాన్ని అలానే ఉంచారు. ఒక నెల తరువాత, శాస్త్రవేత్తలు పిల్లలందరి చర్మం, రక్తం, మలవిసర్జన నమూనాలను సేకరించారు.కొన్ని వారాలు గడిచాక.. పరిశోధకులు ఆరోగ్యపరంగా అనేక మార్పులను గుర్తించారు. మట్టి మైదానాలతో కూడిన డేకేర్ కేంద్రాల్లోని పిల్లల మైక్రోబయోటా ప్రకృతి-ఆధారిత డేకేర్ కేంద్రాలకు హాజరైన పిల్లల మైక్రోబయోమ్‌ల మాదిరిగా త్వరగా మారిపోయినట్టు గుర్తించారు.ఈ మార్పు రోగనిరోధక వ్యవస్థలో కూడా మార్పు తీసుకొచ్చినట్టు పరిశోధకులు నిర్ధారించారు. డేకేర్ కేంద్రాల్లోని పిల్లలు వారి రక్తంలో శోథ నిరోధక ప్రోటీన్లకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ల అధిక నిష్పత్తిని అభివృద్ధి చేశాయని గుర్తించారు.

Related Posts