please-hang-me-depressed-man-reaches-police-station-after-murdering-24-year-old-pregnant-live-in-partner

సహజీవనం చేస్తున్న యువతిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన యువకుడు, ఉరి తియ్యాలని విన్నపం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పుణెలో దారుణం జరిగింది. ఓ యువకుడు తనతో సహజీవనం చేస్తున్న యువతిని అతి కిరాతకంగా చంపేశాడు. గర్భవతి అని తెలిసినా హత్య చేశాడు. ఆ తర్వాత పశ్చాతాపంతో కుమిలిపోయాడు. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అతడు డిప్రెషన్ కు లోనయ్యాడు. తాను తప్పు చేశానని కుమిలిపోయిన అతడు, తనను ఉరి తియ్యాలని పోలీసులను వేడుకున్నాడు.



పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పుణె జిల్లా కోరేగావ్ లో యువతీ(24), యువకులు(27) నివాసం ఉంటున్నారు. వారి పేర్లు సోనామని సోరేన్, కిరణ్. ఇద్దరూ వేర్వేరు ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ చేస్తున్నారు. సహజీవనం చేస్తున్నారు. ఓ అద్దె ఇంట్లో కొన్నాళ్లుగా కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం ఆ యువతి గర్భవతి. అయితే గర్భం విషయమై ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. ఇరువురి నడుమ గొడవ జరిగింది. అది కాస్తా ముదిరింది. కిరణ్ కోపంతో ఊగిపోయాడు. అదే కోపంలో యువతిని హత్య చేశాడు.



ఆ తర్వాత కిరణ్, రంజన్ గావ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులను అడిగి తెల్ల కాగితం, పెన్ ఇప్పించుకున్నాడు. ”నేను డ్రిపెషన్ తో బాధపడుతున్నా. నేను హత్య చేశాను. దయచేసి నన్ను ఉరి తియ్యండి” అని లేఖలో రాశాడు. ఆ లేఖను పోలీసులకు ఇచ్చాడు కిరణ్. అలాగే తన రూమ్ అడ్రస్ చెప్పి తాళం కూడా ఇచ్చాడు. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు. తాళం తీసి లోనికి వెళ్లి చూడగా, యువతి విగతజీవిగా కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.



పోలీసులు కిరణ్ ను అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశారు. దర్యాఫ్తు జరుపుతున్నామని పూర్తి వివరాలు త్వరలోనే తెలుపుతామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని నిజాలు తెలుస్తాయన్నారు.

Related Posts