లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ప్రధాని పుట్టినరోజుకు ఏం చేశారో తెలుసా

Published

on

PM Modi offers prayers at Sardar Sarovar dam on his 69th birthday

సెప్టెంబర్ 17వ తేదీ తన 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు వెళ్లారు. సర్దార్ సరోవర్ డ్యాం వద్ద ఉన్న నర్మద దేవతకు చేసిన పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న నమామీ దేవీ నర్మదె మహోత్సవాల్లో భాగంగా గుజరాత్ ముఖ్య మంత్రి విజయ రూపాణీతో కలిసి మోడీ పాల్గొన్నారు. 

ఆ తర్వాత కెవాడియాలో ఉన్న బటర్ ఫ్లై గార్డెన్‌కు వెళ్లారు. అక్కడ కాషాయ రంగులో ఉన్న సీతాకోకచిలుకను రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటించారు. పర్యటనలో భాగంగా ముందు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు. 138.68మీటర్ల ఎత్తులో ఉన్న రిజర్వాయర్‌కు నిండుగా నీళ్లు రావడంతో అక్కడ జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్నారు. 

2017 తర్వాత నీటి స్థాయి పెంచాక రిజర్వాయర్ నిండుకోవడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రితో కలిసి నర్మదా నీటికి స్వాగతం తెలిపారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీని ఓ టూరిజం స్పాట్‌గా తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించారు. పర్యాటకులకు కనువిందు చేసేందుకు బోట్ ప్రయాణం, బటర్ ఫ్లై పార్క్, ఏక్తా నర్సరీలు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత నర్మదా ఒడ్డున ఉన్న గరుడేశ్వర్ గ్రామంలోని దత్త్ మందిర్‌ను సందర్శించారు. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *