Home » సియోల్ అవార్డు స్వీకరించిన మోడీ : ఈ పురస్కారం భారతీయులదే
Published
2 years agoon
By
veegamteamసియోల్ : దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సియోల్ శాంతి అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఈ పురస్కారాన్ని భరతజాతికి అంకితం చేస్తున్నానని తెలిపారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ప్రేరణ, కృషి వల్లే గత ఐదేళ్లలో భారత్ ఎంతో సాధించిందనీ.. దేశ ప్రజలందరి తరపున నేను ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నానని ప్రధాని అన్నారు. పురస్కారంతో పాటు వచ్చిన 2 లక్షల డాలర్లను గంగానది ప్రక్షాళన కోసం ఈ పథకాన్ని చేపట్టిన ‘నమామి గంగా’ ప్రాజెక్టుకు వినియోగిస్తామని తెలిపారు.
మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకోనున్న సంవత్సరంలో తనకు ఈ పురస్కారం రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇండియాను ఆర్థికంగా ముందుకు నడిపేలా… నిర్ణయాలు తీసుకోవడం, సంస్కరణలు అమలు చేస్తున్న కారణంగానే ప్రధానమంత్రికి ఈ అవార్డ్ దక్కిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఢిల్లీలో తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలను బాగుచేసుకోవడంతో పాటు ఆర్థిక వృద్ధి పెరుగుదలకు ప్రధాని నరేంద్రమోడీ కీలక నిర్ణయాలు తీసుకున్నారని అవార్డు కమిటీ చైర్మన్ క్వోన్ ఈ హైయోక్ అన్నారు. నోట్లరద్దుతో ప్రధానమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని…ఈ నిర్ణయంతో అవినీతికి అడ్డుకట్ట పడిందన్నారు.గతంలో ఈ అవార్డును యూఎన్ఓ మాజీ సెక్రటరీలుగా వ్యవహరించిన జనరల్ కోఫీ అన్నన్, బాన్ కీ మూన్ లు అందుకున్నారు. రెండేళ్లకోసారి ప్రధానం చేసే ఈ అవార్డ్ అందిస్తారు. ఈ క్రమంలో 2018 ఏడాదికి గానూ మోడీని ఎంపిక చేశారు.
#WATCH Live from Seoul, South Korea: PM Modi’s address on receiving the Seoul Peace Prize https://t.co/OJsjaYtRQ8
— ANI (@ANI) February 22, 2019